E-Paper
Advertisement

Top Web Series in OTT 2024 : 2024లో ఓటీటీని డామినేట్ చేసిన టాప్ వెబ్ సిరీస్ లు… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా?

Top Web Series in OTT 2024 : 2024లో ఓటీటీని డామినేట్ చేసిన టాప్ వెబ్ సిరీస్ లు… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా?
Advertisement

Top Hindi Web Series in OTT 2024 : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ ల సందడి నడుస్తుంది. ఈ సిరీస్ లు డైరెక్ట్ గా  కొన్ని ఎపిసోడ్స్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. 2024లో వచ్చిన బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం పదండి.

సిటాడెల్ : హనీ బన్నీ (Citadel : Honey Bunny)

Advertisement

సిటాడెల్: హనీ బన్నీ అనే ఈ  వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంతా రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించగా, డికె దర్శకత్వం వహించారు. ఇది ఒక  ఇండియన్ గూఢచారి యాక్షన్ టెలివిజ న్ సిరీస్. సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ 6 నవంబర్ 2024న ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజా ఖబర్ (Taaza Khabar)

Advertisement

ఈ వెబ్ సిరీస్ లో భువన్ బామ్, శ్రియా పిల్గావ్కర్, J. D. చక్రవర్తి, దేవేన్ భోజాని, ప్రథమేష్ పరబ్, నిత్యా మాథుర్ మరియు శిల్పా శుక్లా నటించారు. తాజా ఖబర్ అనేది ఒక కామెడీ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 2024నుంచి డిస్నీ+ హాట్‌స్టార్ లో ఈ వెబ్  సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

శేఖర్ హోమ్ (Shekhar Home) 

ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, రణ్‌వీర్ షోరే, రసిక దుగల్, కీర్తి కుల్హారి, దిబ్యేందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ వెబ్ సిరీస్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్. రోహన్ సిప్పీ, ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ను BBC స్టూడియోస్ ప్రొడక్షన్స్ నిర్మించింది.  ఈ సిరీస్ జియోసినిమాలో 14 ఆగస్టు 2024 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది.

మర్డర్ ఇన్ మహీమ్ (Murder In Mahim) 

ఈ వెబ్ సిరీస్ లో విజయ్ రాజ్, అశుతోష్ రానా, శివాని రఘువంశీ మరియు శివాజీ సతం నటించారు. ముస్తఫా నీముచ్‌వాలా, ఉదయ్ సింగ్ పవార్ కధను అందించారు. ఈ వెబ్ సిరీస్ కు రాజ్ ఆచార్య దర్శకత్వం వహించారు. జియోసినిమాలో వచ్చిన క్రైమ్ డ్రామా TV సిరీస్.  ఈ వెబ్ సిరీస్ 10 మే 2024 నుంచి జియోసినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi : The Diamond Bazaar)

2024లో హిందీలో విడుదలైన ఈ టెలివిజన్ వెబ్ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. భన్సాలీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజయ్ లీలా బన్సాలీ, ప్రేరణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఏప్రిల్ 9న విడుదల చేసి మే 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఆడియోల్లో, 9 విదేశీ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×