Hero Simbu.. ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు (Simbu)కి చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ’కు కోటి రూపాయలు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి ఒక్కరు అసలేం జరిగిందని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు శింబు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, హీరోగానే కాకుండా దర్శకుడిగా, గాయకుడిగా కూడా ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
వివాదంలో చిక్కుకున్న శింబు..
ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్న ఇప్పటివరకు ఎన్నో ప్రేమయునాలు నడిపాడు కానీ ఇప్పటివరకు పెళ్లి పీటలు ఎక్కలేదు కొన్ని రోజుల క్రితం శ్రీలంకకు చెందిన అమ్మాయిని తండ్రి ప్రోత్బలంతో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి కానీ అది పుకారుగానే మిగిలిపోయింది.. ఇకపోతే శంభు గత కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే కానీ కాన్ఫెరెన్ సినిమాతో ప్రియంట్లీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కరోనా కుమార్ అనే సినిమాకి కూడా కమిట్ అయ్యి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు శింబు.
పారితోషకం తీసుకొని డుమ్మా కొట్టిన హీరో..
వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ ‘కరోనా కుమార్’ అనే సినిమాను చిత్రీకరించాలనుకుంది. ఇందులో హీరోగా నటించడానికి శింబు కూడా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో తన హీరో పాత్ర కోసం రూ.5.50 కోట్ల పారితోషకం తీసుకోవాలనుకున్నారు. ఇక అందులో భాగంగానే 2021లో రూ.4.50 కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా అందుకున్నారు. అయితే నిర్మాణ సంస్థ మాత్రం శింబు షూటింగ్ కు రాలేదని ఆరోపిస్తోంది. కరోనా కుమార్ చిత్రాన్ని పూర్తి చేయకుండానే.. ఇతర చిత్రాలలో నటించడానికి వీలు లేకుండా నిషేధించాలని కోరుతూ నిర్మాణ సంస్థ తరఫున చెన్నై హైకోర్టులో కేస్ దాఖలు చేసింది. ఈ కేసు పై విచారణ జరిపిన హైకోర్టు శింబు కోటి రూపాయల పూచీకత్తు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు శింబు, వేల్స్ ఫిల్మ్స్ మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కన్నన్ ను మధ్యవర్తిగా కూడా నియమించింది.
ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చిన రిటైర్డ్ న్యాయమూర్తి..
ఈ నేపథ్యంలోనే నటుడు శింబు తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. మధ్యవర్తి ముందు ఇరువర్గాలు కేసును ఉపసంహరించుకున్నాయని కూడా ఆయన తెలిపారు. అంతేకాదు కోర్ట్ లో డిపాజిట్ చేసిన నాలుగు లక్షల 98000 రూపాయలను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని శింబు అభ్యర్థించాడు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి శింబు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని హైకోర్టు చీఫ్ రిజిస్ట్రార్ ను ఆదేశించింది.
శింబు సినిమాలు..
శింబు కెరియర్ విషయానికి వస్తే.. బాలనటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా మారి మన్మధన్, విన్నైతాండి వరువాయ వంటి చిత్రాలు చేసి మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాదు ఈయన తమిళంలో నటించిన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. అలా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన శింబు ఇప్పుడు ఈ కేసు నుంచి కూడా బయటపడినట్లు తెలుస్తోంది.