OTT Movie : గన్ కల్చర్ లేని సౌత్ కొరియాలో, ఒక్కసారిగా అక్రమ ఆయుధాలు అందరి చేతిలోకి వస్తే ఏం జరుగుతుంది? ఈ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? అనే కంటెంట్ తో వచ్చిన ఒక కొరియన్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ సైకలాజికల్ డ్రామాతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్విస్ట్‌లతో గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్ లో
‘ట్రిగ్గర్’ (Trigger) 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ యాక్షన్-క్రైమ్-థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి క్వాన్ ఓ-సియుంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో కిమ్ నామ్-గిల్, కిమ్ యంగ్-క్వాంగ్, పార్క్ హూన్, కిమ్ వోన్-హే ప్రధాన పాత్రల్లో నటించారు. బిడంగిల్ పిక్చర్స్, ఇన్‌సైడర్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందింది. 10 ఎపిసోడ్‌లు, ఒక్కోటి సుమారు 50 నిమిషాల రన్‌టైమ్‌తో వచ్చింది. ఈ సిరీస్ గన్-ఫ్రీ సౌత్ కొరియాలో అక్రమ ఆయుధాల సరఫరా, దాని ఫలితంగా జరిగే క్రైమ్, ఒక సైకలాజికల్ డ్రామాని ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. దీనికి IMDbలో 7.8/10 రేటింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ తో అందుబాటులో ఉంది.
Read Also : ఆ కోరికలు తీర్చుకోవడానికి తోలుబొమ్మతో అమ్మాయి డీల్… కట్ చేస్తే మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్
సిరీస్ ఒక ఫిక్షనల్ సౌత్ కొరియాలో జరుగుతుంది. ఇక్కడ గన్‌లు కొనడం, అమ్మడం, ఓన్ చేయడం పూర్తిగా బ్యాన్. ఇక్కడ గన్ క్రైమ్స్ దాదాపు జీరో. కానీ ఒక్కసారిగా, తెలియని సోర్స్ నుంచి అక్రమ గన్‌లు కొరియర్ ద్వారా అందరి చేతిలోకి వస్తాయి. సాధారణ సిటిజన్స్ నుంచి క్రిమినల్స్ వరకు అందరికీ ఈ గన్స్ అందుతున్నాయి. దీంతో సొసైటీలో గందరగోళం మొదలవుతుంది. మాస్ షూటింగ్స్, రోడ్ రేజ్, పర్సనల్ రివెంజ్‌లతో క్రైమ్ రేట్ స్కైరాకెట్ అవుతుంది. ఇక ప్రధాన క్యారెక్టర్స్ లీ డో ఒక రైటియస్ డిటెక్టివ్. గతంలో మిలిటరీ స్నైపర్. అతను ఈ గన్ క్రైమ్స్‌ని ఆపడానికి, అక్రమ ఆయుధాల సోర్స్‌ని కనిపెట్టడానికి తన స్కిల్స్ ఉపయోగిస్తాడు. కానీ అతని పాస్ట్‌లో ఒక ట్రామా అతన్ని హాంట్ చేస్తుంది. ఇది అతని డెడికేషన్‌ని టెస్ట్ చేస్తుంది.
ఇక సిరీస్ ఒక షాకింగ్ మాస్ షూటింగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇది కొరియాని షేక్ చేస్తుంది. లీ డో, డిటెక్టివ్‌గా, ఈ గన్‌ల సోర్స్‌ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ గన్‌లు సాధారణ పీపుల్ చేతిలోకి, టీనేజర్స్, ఆఫీస్ వర్కర్స్, క్రిమినల్స్‌కి కూడా వెళ్తుంటాయి. ఈ క్రైసిస్ అతని పర్సనల్ లైఫ్‌ని కూడా టచ్ చేస్తుంది. మరోవైపు మూన్ బేక్ ఈ గన్ డిస్ట్రిబ్యూషన్‌లో స్ట్రాటెజిక్ ప్లేయర్. అతను లీ డోతో క్యాట్-అండ్-మౌస్ గేమ్ ఆడతాడు. కానీ అతని బ్యాక్‌స్టోరీ రివీల్ అవుతుండగా, అతని యాక్షన్స్ వెనుక డీపర్ మోటివ్స్ కనిపిస్తాయి. ఈ ఇద్దరి మధ్య క్లాష్ కేవలం గన్‌ల గురించి కాదు, ఇది జస్టిస్ vs సర్వైవల్, కంట్రోల్ vs ఫ్రీడమ్ గురించి ఒక ఐడియాలజికల్ ఫైట్ జరుగుతుంది.
చివరి ఎపిసోడ్‌లలో లీ డో, మూన్ బేక్ మధ్య ఫైనల్ క్లాష్ జరుగుతుంది. గన్‌ల సోర్స్ రివీల్ అవుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్‌తో లింక్ అవుతుంది. లీ డో తన పాస్ట్ ట్రామాని ఫేస్ చేస్తూ, జస్టిస్ కోసం ఫైట్ చేస్తాడు. కానీ మూన్ బేక్ యాక్షన్స్ అతని ఓన్ ట్రాజెడీని రిఫ్లెక్ట్ చేస్తాయి. సిరీస్ ఒక ఎమోషనల్, యాక్షన్-ప్యాక్డ్ నోట్‌తో ముగుస్తుంది. ఈ గన్ కల్చర్ కంట్రోల్ అవుతుందా ? లీ డో గ్యాంగ్ స్టర్లని ఎదుర్కొంటాడా ? సౌత్ కొరియా సేఫ్ జోన్ కి వెళ్తుందా ? అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.