హీరోయిన్ సదా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సత్తా చాటింది. ముఖ్యంగా ‘జయం’ సినిమాలో “వెళ్లవయ్యా.. వెళ్లూ..” అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటీ బాగా పాపులర్. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే, ఎక్కువ కాలం ఆమె సినిమా పరిశ్రమలో రాణించలేకపోయింది. కొద్ది సంవత్సరాల్లోనే పూర్తిగా ఫేడౌట్ అయ్యింది.
వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తున్న సదా..
సదా ఇప్పుడు హీరోయిన్ అవతారాన్ని మానేసి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. నిత్యం సఫారీల్లో తిరుగుతూ అదిరిపోయే ఫోటోలను షూట్ చేస్తోంది. ఆమె చిత్రీకరించిన పలు వైల్డ్ లైఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సింహాలు, పులులు,చిరుతలు, ఏనుగులు, పాములు, కప్పలు, పక్షలు ఒకటేమిటీ అన్ని జీవులను అద్భుతంగా తన కెమెరాలో బంధిస్తోంది.
వైరల్ అవుతున్న సింహం వీడియో
తాజాగా సదా ఓ సింహం వీడియోను షూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోను పరిశీలిస్తే, ఓ ఆడ సింహం ఎంతో కష్టపడి చెట్టు ఎక్కింది. కొమ్మ మీద కూర్చోవాలని ప్రయత్నించింది. కానీ, అక్కడ కూర్చోవడానికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ప్రయత్నం చేసింది. ఎంతకీ సాధ్యం కాకపోవడంతో విసుగు చెందింది. ఇక అక్కడ కూర్చోవాలనే కోరిక నెరవేరదని భావించింది. ఇక చేసేదేమీ లేదని ఫీలయ్యింది. నెమ్మదిగా ఎలా ఎక్కిందో.. అలాగే దిగింది. తన దారి తాను చూసుకుంది. ఈ తతంగాన్ని అంతా సదా తన కెమెరాలో బంధించింది. ఈ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో సెల్ ఫోన్ కొట్టేయబోయిన దొంగ.. ప్రయాణీకులకు చిక్కి, చివరికి..
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “సదా సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆమెకు ఈ రంగంలో మంచి ఫ్యూచర్ ఉన్నట్లు కనిపిస్తోంది” అని నెటిజన్లు రాసుకొస్తున్నారు. “ఈ వీడియో ఆ సింహ చెట్టు మీద కూర్చోలేకపోయినా, అక్కడ కూర్చునేందుకు అది చేసిన ప్రయత్నం అద్భుతంగా ఉంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “అంత బలమైన సింహం, చెట్టు మీదికి ఎక్కడం నిజంగా అద్భుతంగా ఉంది” అని ఇంకొందరు కామెంట్స్ చేశారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సదాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచంలోని టాప్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లలో ఆమె ఒకరు కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం అసవరం లేదని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: ఆ దేశాల్లో పాలను నిల్వ ఉంచేందుకు వాటిలో కప్పలను వేస్తారట, భలే చిట్కా!