E-Paper
Advertisement

ఎడారి మధ్యలో శవం… 99 నిమిషాల థ్రిల్లర్… చివరి వరకు సస్పెన్స్ గ్యారెంటీ

ఎడారి మధ్యలో శవం… 99 నిమిషాల థ్రిల్లర్… చివరి వరకు సస్పెన్స్ గ్యారెంటీ
Advertisement

Mystery Thriller on OTT : నేరం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయాలంటే ధైర్యం మాత్రమే కాదు.. సమాజం మొత్తం ఎదిరించినా వెనక్కి తగ్గని సంకల్పం కూడా కావాలి. అలాంటి ఓ మహిళ కథనే చెప్పే సౌదీ అరేబియా క్రైమ్ థ్రిల్లర్ ‘అన్‌ఐడెంటిఫైడ్’ (Unidentified). ప్రముఖ దర్శకురాలు హైఫా అల్-మన్సూర్ తెరకెక్కించిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీతో పాటు మహిళలపై ఉన్న సామాజిక ఆంక్షలను కూడా హార్ట్ టచింగ్ గా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీని తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

నవాల్ అనే 29 ఏళ్ల యువతి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంటుంది. పుట్టిన రెండు రోజులకే తన బిడ్డను కోల్పోవడం, ఆ తర్వాత భర్తతో విడాకులు తీసుకోవడం వల్ల ఆమె పూర్తిగా ఒంటరిదై పోతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో పాత కేసుల ఫైళ్లను డిజిటలైజ్ చేసే ఉద్యోగంలో చేరుతుంది.

Advertisement

ఒకరోజు రియాద్ నగర శివార్లలోని ఎడారిలో గుర్తు తెలియని ఓ టీనేజ్ అమ్మాయి మృతదేహం లభిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఏకైక మహిళా ఉద్యోగి నవాల్ మాత్రమే కావడంతో, ఆమె కూడా ఘటనా స్థలానికి వెళ్తుంది. పోలీసులు ఈ కేసును సాధారణ ఘటనగా భావించి పెద్దగా పట్టించుకోకపోయినా, ట్రూ క్రైమ్ కథలపై ఆసక్తి ఉన్న నవాల్ మాత్రం కొన్ని చిన్న ఆధారాలను గమనించి స్వయంగా దర్యాప్తు ప్రారంభిస్తుంది.

దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మృతురాలు ఒక బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థిని అని తెలుస్తుంది. అయితే ఆమె కుటుంబం, పాఠశాల నిర్వాహకులు సహా పలువురు నిజాన్ని దాచేందుకు ప్రయత్నిస్తుంటారు. పై అధికారుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా నవాల్ ఒక్కొక్క క్లూను వెంబడిస్తూ అసలు నేరస్థుల వరకు చేరుకునే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

సమాజంలోని కఠినమైన సంప్రదాయాలు, మహిళలపై ఉన్న పరిమితులను ఎదుర్కొంటూ నవాల్ ఆ అపరిచిత యువతి మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎలా బయట పెట్టింది ? ఈ కేసు వెనుక దాగి ఉన్న షాకింగ్ ట్విస్ట్ ఏమిటి ? చివరికి ఆ చనిపోయిన అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా ? అన్నదే సినిమా క్లైమాక్స్.

Also Read : బంగారం కోసం వచ్చిన దొంగలకు చుక్కలు చూపించే శివంగి… మంచులో సాగే సర్వైవల్ థ్రిల్లర్

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘అన్‌ఐడెంటిఫైడ్’లో సస్పెన్స్‌తో పాటు మహిళల హక్కులు, సామాజిక అసమానతలు, పోలీసు వ్యవస్థలోని లోపాలను కథలో సహజంగా మిళితం చేశారు. నెమ్మదిగా సాగే దర్యాప్తు, చివరివరకు ఆసక్తి కలిగించే ట్విస్టులు ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఒరిజినల్ అరబిక్ ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు, అంతర్జాతీయ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సినిమాను అసలు మిస్ అవ్వొద్దు. ఉత్కంఠభరితమైన కథతో పాటు సామాజిక సందేశాన్ని కూడా అందించే ఈ సౌదీ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×