OTT Movie : ఓటిటిలో రకరకాల కంటెంట్ తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో , ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. దీనికి తోడు కోరిక తీర్చమనే దయ్యం కూడా ఒకటి ఉంటుంది. సినిమా మొత్తం బూ*తు మాటలే ఎక్కువగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులోస్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
వీర అమ్మాయిలతో ప్లే బాయ్ వేషాలు వేస్తుంటాడు. ఇతన్ని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. చివరికి థెండ్రాల్ అనే అమ్మాయి పెళ్లి ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అయితే మరో జంటని కూడా హనీమూన్ కి రమ్మని కోరుతుంది. ఈ విషయం వీర తన ఫ్రెండు వాసుకి చెప్తాడు. వాసు కూడా తన గర్ల్ ఫ్రెండ్ కావ్యని తీసుకొని ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేస్తాడు. ఇలా ఈ రెండు జంటలు పెళ్లి చేసుకుని బ్యాంకాక్ కు హనీమూన్ కి వెళ్తారు. అక్కడ వీళ్ళంతా కలసి ఒక హోటల్లో స్టే చేస్తారు. అందులో ఒక గది శాశ్వతంగా మూసి ఉంటుంది. ఆ గదిలోకి వెళ్లకూడదని హోటల్ సిబ్బంది వీళ్లను హెచ్చరిస్తారు.
ఇంతలో వీరా, వాసు వయాగ్రా పొరపాటున తాగుతారు. ఇక వాళ్ల కష్టాలు మాటల్లో చెప్పలేము. ఈ క్రమంలోనే వాళ్లు అక్కడ మూసి ఉన్న గదిలోకి వెళ్తారు. అక్కడ కామంతో కటకట లాడుతున్న ఒక దయ్యాన్ని చూస్తారు. ఆ దయ్యం వీళ్ళను కోరిక తీర్చమని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అదికూడా కోరిక తీరాకుండానే చచ్చిపోయిందంట. ఈ దయ్యం వల్ల హనీ మూన్ లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఆ దయ్యం కోరికను వీళ్ళు తీరుస్తారా ? హనీమూన్ ఎవరితో ఎవరికి జరుగుతుంది ? ఆ దయ్యం గతం ఏమిటి ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : వీడెక్కడి సైకోనండి బాబు, పాట పాడకపోతే మనుషుల్ని చంపేస్తున్నాడు … మతిపోయే ట్విస్టులు ఉన్న మలయాళం థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అడల్ట్ హారర్ కామెడీ మూవీ పేరు ‘ఇరండం కుత్తు’ (Irandam Kuththu). 2020 లో విడుదలైన ఈ తమిళ మూవీకి సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వీర (సంతోష్ పి. జయకుమార్), వాసు (డేనియల్ అన్నీ పోప్) అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకుని, హనీమూన్ కోసం బ్యాంకాక్‌లోని ఒక రిసార్ట్‌కు వెళతారు. అక్కడ జరిగే రచ్చ మామూలుగా ఉండదు. తెలుగులో కూడా ఈ మూవీని రీమేక్ చేశారు. ‘చీకట్లో చితక్కొట్టుడు’ అనే పేరుతో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.