BigTV English
Advertisement

OTT Movie : అల్లుడి చావుకి మామ రివేంజ్ … ఓటీటీలో దంచి కొడుతున్న కొరియన్ యాక్షన్ డ్రామా

OTT Movie : అల్లుడి చావుకి మామ రివేంజ్ … ఓటీటీలో దంచి కొడుతున్న కొరియన్ యాక్షన్ డ్రామా

OTT Movie : కొరియన్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు హాట్ కేకుల్లా మారిపోయాయి. చాలా మంది ఇప్పుడు వీటినే ఫాలో అవుతున్నారు. వీటివళ్లే సీరియల్స్ కి కూడా డిమాండ్ తగ్గుతోంది. అంతలా ఇవి ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ వెబ్ సిరీస్ లో దిమ్మతిరిగే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. హీరో తన మేనల్లుడి చావుకి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఈ స్టోరీ తెరకెక్కింది. ఈ యాక్షన్ థ్రిల్లర్  సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ దక్షిణ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘వాగాబాండ్’ (Vagabond). 2019 లో విడుదలైన ఈ సిరీస్‌లో లీ సీయుంగ్-గీ, బే సుజీ, షిన్ సంగ్-రాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ శైలిలో ఉంటుంది. ఇది SBS TVలో సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 23, 2019 వరకు 16 ఎపిసోడ్‌లతో ప్రసారం చేయబడింది. ప్రతి ఎపిసోడ్ దక్షిణ కొరియాలో ప్రసారం చేసిన తర్వాత అంతర్జాతీయంగా విడుదల చేయబడింది.  ఈ స్టోరీలో ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఉగ్రవాదుల మధ్య రాజకీయ కుట్రలు, యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

చా దల్-గన్ ఒక స్టంట్‌మ్యాన్ గా ఉంటాడు. అతను తల్లిదండ్రులు లేని తన మేనల్లుడు చా హూన్‌ని చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు, చా హూన్ మొరాకోకు వెళ్ళడానికి ఒక బోయింగ్ విమానంలో ప్రయాణిస్తాడు. కానీ ఆ విమానం ఒక ఒక కుట్రలో భాగంగా కూలిపోతుంది. ఇందులో 200 మందికి పైగా ప్రయాణికులు మరణిస్తారు. అందులో చా హూన్ కూడా ఉంటాడు. తన మేనల్లుడు చావుకు, చా దల్-గన్ రెవేంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు ఈ దుర్ఘటన వెనుక ఉన్న కుట్రను కనిపెట్టడానికి, చా దల్-గన్ ఒక మిషన్‌ను ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియలో అతను గో హే-రీ అనే నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఏజెంట్‌ను కలుస్తాడు. ఆమె తన కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి ఈ ఉద్యోగంలో చేరి ఉంటుంది. వారిద్దరూ కలిసి, విమాన ప్రమాదం వెనుక ఉన్న ఉగ్రవాద కుట్రను బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. చా దల్-గన్, గో హే-రీ ఈ కుట్రను ఛేదించే క్రమంలో అనేక ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ ప్రయాణం వాళ్ళు మొరాకో, పోర్చుగల్ వంటి అంతర్జాతీయ స్థలాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది.  చివరికి వీళ్ళు ఆ కుట్ర వెనుక వున్న రహస్యాన్ని బయట పెడతారా ? తన మేనల్లుడు చావుకు చా దల్-గన్ ప్రతీకారాం తీర్చుకుంటాడా ? అనే ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒక్కొక్కరు కాదు ఒకే సారి ఐదు మంది… ఆగలేక అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయి

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×