OTT Movie : ఓటీటీలో కొరియన్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అందులోనూ యాక్షన్ సినిమాలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిటెక్టివ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా యాక్షన్ సీన్స్ తో అదరగొడుతోంది. ఇది దక్షిణ కొరియా సినిమా చరిత్రలో 5వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కొరియన్ యాక్షన్ మూవీ పేరు (Veteran). 2015లో విడుదలైన ఈ సినిమాకి ర్యూ సీంగ్-వాన్ దర్శకత్వం వహించారు. ఇందులో హ్వాంగ్ జంగ్-మిన్ (సియో డో-చీయోల్), యూ ఆహ్-ఇన్ (జో టే-ఓహ్), యూ హే-జిన్, ఓహ్ డాల్-సు, జాంగ్ యూన్-జూ (మిస్ బాంగ్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాసా ఏసియా అవార్డును గెలుచుకుంది. దాని యాక్షన్ సన్నివేశాలు, కామెడీ కోసం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. IMDbలో 7.0/10 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ సినిమా Netflix, Amazon Prime Video, Apple TV లలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
సియో డో-చీయోల్ సియోల్ మెట్రోపాలిటన్ క్రైమ్ బ్యూరోలో ఒక ధైర్యవంతమైన నిజాయితీ గల డిటెక్టివ్. అతను తన టీమ్‌తో కలిసి ఒక దొంగతనం కేసుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్‌లో పనిచేస్తాడు. ఈ ఆపరేషన్ సమయంలో, అతను బసన్‌లో ఒక ట్రక్ డ్రైవర్ అయిన బే, అతని 9 ఏళ్ల కుమారుడు జిన్-చీయోల్ ను కలుస్తాడు. వీళ్ళు అతనికి సహాయం చేస్తారు. ఈ స్టింగ్ విజయవంతమైన తర్వాత, డిటెక్టివ్ ఒక క్లబ్‌లో సిన్జిన్ గ్రూప్ వారసుడైన జో టే-ఓహ్ ను కలుస్తాడు. అతని దురుసు ప్రవర్తన, డ్రగ్-అడిక్టెడ్ వైఖరి డిటెక్టివ్ కు అనుమానాస్పదంగా అనిపిస్తుంది.
అదే సమయంలో వేతనాలు చెల్లించని కారణంగా, బే సిన్జిన్ గ్రూప్‌కు వ్యతిరేకంగా నిరసన చేస్తాడు. కానీ టే-ఓహ్ అతన్ని అవమానిస్తాడు. అంతే కాకుండా అతన్ని కొట్టి ఆనందిస్తాడు. ఈ దాడి తర్వాత బే ఆసుపత్రిలో చేరతాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. బే కుమారుడు జిన్-చీయోల్, డిటెక్టివ్ సహాయం కోరతాడు. ఈ సంఘటన టే-ఓహ్‌పై డిటెక్టివ్ విచారణ ప్రారంభించేలా చేస్తుంది. అతను సిన్జిన్ గ్రూప్‌కు చెందిన ఒక సాడిస్టిక్, శక్తివంతమైన వారసుడని తెలుసుకుంటాడు.
టే-ఓహ్ తన డబ్బు, పలుకుబడి ఉపయోగించి, డిటెక్టివ్ ను ఈ కేసు నుంచి తప్పుకోమని ఒత్తిడి చేస్తాడు. అంతే కాకుండా డిటెక్టివ్ భార్యకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఆ డబ్బును తిరస్కరిస్తుంది. ఈ లంచం గురించి తెలుసుకున్న డిటెక్టివ్, టే-ఓహ్‌ను బెదిరిస్తాడు. ఇది వారి మధ్య తీవ్రమైన గొడవలకు దారితీస్తుంది. ఆతరువాత డిటెక్టివ్ మీదకి రౌడీలను పంపుతాడు టే-ఓహ్. చివరికి డిటెక్టివ్ టే-ఓహ్ ను ఎలా ఎదుర్కుంటాడు ? డిటెక్టివ్, టే-ఓహ్ పై కేసు గెలుస్తాడా ? వీళ్ళ గొడవలు ఎలా ఎండ్ అవుతాయి? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : డబ్బు కోసం 120 మంది అమ్మాయిలతో… ఈ డాక్టర్ చేసే పనికి రక్తం మరగాల్సిందే మావా