Madha Gaja Raja OTT Release.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఎప్పుడో 2013లో నటించిన ఒక సినిమాను దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది పొంగల్ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘మదగజరాజా’ అనే టైటిల్ తో సినిమా పూర్తయినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దాంతో ఆ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సుందర్ . సీ (Sundar C) దర్శకత్వం వహించగా.. విశాల్ సరసన అంజలి(Anjali ), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) లు నటించారు. పూర్తిగా కామెడీ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా నటుడు సంతానం (Santhanam) కమెడియన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ (Vijay Antony) సంగీతాన్ని అందించగా.. ఇందులో విశాల్ పాడిన పాట ఇప్పటికీ ఇంటర్నెట్లో పాపులర్ గా మారింది.
Kannappa Teaser 2 Review : మరో ట్రోల్ స్టఫ్ వచ్చేసింది… ఏ మాత్రం ఆకట్టుకోలేని టీజర్
విశాల్ మూవీకి ఓటీటీ కష్టాలు..
12 ఏళ్ల తర్వాత విడుదలైనా కూడా ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది. కానీ ఇలాంటి సినిమాకి ఇప్పుడు ఓటీటీ కష్టాలు రావడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పవచ్చు. మదగజరాజా సినిమా విడుదలై ఇప్పటికే రెండు నెలలు కావస్తోంది. ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు. అంతేకాదు ఏ ఓటిటి ప్లాట్ఫారం కూడా ఈ సినిమాతో లింక్ చేయలేదని సమాచారం మొత్తానికైతే బాక్స్ ఆఫీస్ వద్ద వేటను మొదలుపెట్టిన ఈ చిత్రానికి ఓటీటీ లైసెన్స్ రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా థియేటర్లలో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు ఓటీటీకి నోచుకోవడానికి ఇక్కట్లు పడడంతో అసలేమైందని అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు.
విశాల్ కెరియర్..
విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి 1975 ఆగస్టు 29న జన్మించిన నటుడిగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు మాతృభాష తెలుగు అయినప్పటికీ తమిళ్ సినిమాలు ఎక్కువగా చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. విశాల్ ఎవరో కాదు ప్రముఖ సినీ నిర్మాత జి.కే.రెడ్డి చిన్న కొడుకు. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసిన ఈయన తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ తో ఎన్నో సినిమాలను నిర్మించి, తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక నటుడిగానే కాకుండా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే విశాల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఈయన తోటి నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలకు జన్మనిస్తుంటే.. విశాల్ మాత్రం ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మరొకవైపు ఎంతో మంది హీరోయిన్స్ తో ఎఫైర్ వార్తలు వచ్చినా అందులో ఏది నిజం కాలేకపోయింది