BigTV English

OTT Movie : మాఫియా కోసం స్కూల్ పాపను కిడ్నాప్ చేసే మూగోడు… పిచ్చెక్కించే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : మాఫియా కోసం స్కూల్ పాపను కిడ్నాప్ చేసే మూగోడు… పిచ్చెక్కించే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : కొరియన్ సినిమాలను, వెబ్ సిరీస్ లను చూసే వాళ్ళు ఇప్పుడు ఎక్కువాగానే ఉన్నారు. ఒకప్పుడు వీటి జోలికి పోని మన ప్రేక్షకులు, కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని వీటికి అభిమానులుగా మారిపోయారు. తెలుగు సీరియల్స్ కి బదులు, ఈ కొరియన్ సిరీస్ లకు అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సినిమా, ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసింది. ఇది COVID-19 మహమ్మారి తర్వాత దక్షిణ కొరియాలో అత్యధిక ఓపెనింగ్ ఇండీ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ ( Voice of Silence). 2020 లో విడుదలైన ఈ సినిమాకి, హాంగ్ యూ-జియాంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో యూ ఆ-ఇన్ (టే-ఇన్), యూ జే-మ్యుంగ్ (చాంగ్-బాక్), మూన్ సియుంగ్-ఆ (చో-హీ), లీ గా-యున్ నటించారు. ఈ సినిమా విమర్శకుల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా దాని డార్క్ కామెడీ, సామాజిక సబ్‌టెక్స్ట్, యూ ఆ-ఇన్ నటన అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది 2021 ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ కోసం చెవల్ నోయిర్ అవార్డ్, 2021 బుసాన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్‌ ను గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

టే-ఇన్ అనే మూగ యువకుడు, చాంగ్-బాక్ అనే వృద్ధుడు ఒక క్రైమ్ సంస్థలో క్లీనర్స్ గా పని చేస్తుంటారు. వీళ్ళు అక్కడ మనుషులను హింసించి చంపిన స్థలాలను శుభ్రం చేస్తుంటారు. శవాలను తొలగించడం. రక్తపు మరకలను కడిగేయడం వంటివి ఒక సాధారణ ఉద్యోగంలా చేస్తారు. ఈ ఉద్యోగం వీరి ఆర్థిక అవసరాలను తీరుస్తుంటుంది. అందుకే వేరే దారి లేక ఈ పని చేస్తుంటారు. టే-ఇన్ కు తల్లిదండ్రులు లేని కారణంగా, తన చెల్లెల్ని తానే చూసుకుంటూ ఉంటాడు. టే-ఇన్‌కు చాంగ్-బాక్ ఒక మార్గదర్శకుడిలా ఉంటాడు. ఒక రోజు వీళ్ళ బాస్ నుండి ఒక ఆదేశం వస్తుంది. 11సంవత్సరాల చో-హీ అనే కిడ్నాప్ చేసిన బాలికను రెండు రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఆమెను టే-ఇన్ తన ఇంటిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు. అక్కడ ఆ అమ్మాయి టే-ఇన్ చెల్లెలితో స్నేహం చేస్తుంది. టే-ఇన్ మౌనంగా ఉన్నప్పటికీ, చో-హీతో ఒక మంచి బంధం ఏర్పడుతుంది.

అయితే ఇప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. ఇతని బాస్ ఆ అమ్మాయిని, ఒక చైల్డ్ ట్రాఫికర్‌కు అప్పగించాలని చూస్తాడు. అయితే ఈ విషయం టే-ఇన్ కు తెలిసి ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయితో ఇతను ఎమోషనల్ గా దగ్గర అవుతాడు. ఇప్పుడు ఆమె భద్రత గురించి ఆందోళన చెందుతాడు. చివరికి ఆ అమ్మాయిని టే-ఇన్ కాపాడతాడా ? అతని బాస్ నుంచి ఏమైనా సమస్యలు వస్తాయా ? ఇంతకీ కిడ్నాప్ కి గురైన అమ్మాయి ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెడితే నరకమే… రెంట్‌కి ఉండాలంటే ప్రాణాలు వదులకోవాలి

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×