War 2 OTT : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం వార్ 2.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.. ఈ మూవీకి పోటీగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అటు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి వాళ్ల కల నెరవేరింది. థియేటర్ లోకి వచ్చినా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ మూవీ ఓటీటీ డీల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..
‘వార్ 2’ ఓటీటీ డేట్..?
వార్ 2 మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం మీద ఈ మూవీ ఓటీటీ డీల్ కుదిరినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారం ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.. థియేటర్లలో ఈ సినిమా పర్ఫామెన్స్ ను బట్టి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూడాలి..
Also Read: శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒకటి వేరీ స్పెషల్..
బడ్జెట్ & బ్రేక్ ఈవెన్..
గతంలో వచ్చిన వార్‌కు సీక్వెల్‌గా వార్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.. ఈ మూవీకి దాదాపుగా 400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు.. తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు విపరీతంగా పోటీ నెలకొంది. వార్ 2 థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్లకు సొంతం చేసుకున్నారు. మొత్తం కలిపి దాదాపు 700 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటిరోజు ఈ సినిమాకి 100 కోట్లలోపే వసూలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది సేపట్లో ఎన్ని కోట్లు రాబట్టిందో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.. బాలీవుడ్ లో ఎన్టీఆర్ నటించిన మొదటి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఒక్కరోజుకే మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఈ మూవీతో ఎన్టీఆర్ ఖాతాలో హిట్ పడినట్లే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో సోలో మూవీలో ఎన్టీఆర్ నటించనున్నారని సమాచారం..