OTT Movie : ‘నరమాంస భక్షకులు’ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కువగానే ఉండేవాళ్ళు. నాగరికత పెరగడంతో ఈ సంతతి తగ్గిపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇలాంటి మనుషులగురించి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మనుషులను పశువుల్లా ఉపయోగించే ఒక కానిబల్ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా యానిమల్ క్రూయెల్టీ, ఫ్యాక్టరీ ఫార్మింగ్‌పై ఒక ఆలెగరీగా పనిచేస్తూ, మనుషులను పశువుల స్థానంలో చూపిస్తూ గ్రాఫిక్ వైలెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీ ఏమిటంటే
నోరా, అలెక్ అనే జంట లాస్ ఏంజిల్స్‌కు రోడ్ ట్రిప్‌లో ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో తప్పిపోయి ఒక డైనర్‌లో ఆగుతారు. అక్కడ వీళ్ళు బర్గర్స్ ఆర్డర్ చేస్తారు. కానీ విచిత్రమైన వెయిట్రెస్, ఒక కస్టమర్ నుండి “మీరు ఇక్కడ సేఫ్ కాదు” అని వార్న్ చేస్తారు. గ్యాస్ స్టేషన్ అటెండెంట్ ఆండ్రూ సలహాతో, వీళ్ళు ఒక బ్రేక్‌ఫాస్ట్ క్యాబిన్‌లో రాత్రి గడపడానికి వెళతారు. అక్కడి ల్యాండ్‌లార్డ్ విచిత్రంగా ప్రవర్తిస్తాడు. నోరా బ్లడ్-స్టెయిన్డ్ మాట్రెస్‌ను గమనించినప్పటికీ, వేరేదారిలేక అక్కడే ఉంటారు. ఆ రాత్రి ఒక షీప్ మాస్క్ ధరించిన వ్యక్తి వారిని కిడ్నాప్ చేస్తాడు. ఈ జంట ఒక ఫార్మ్‌లో కుక్కల బోనులో బంధించబడతారు. అక్కడ మనుషులను పశువుల్లా ట్రీట్ చేస్తుంటారు. పురుషులను మాంసం కోసం, మహిళలను పాలు, బిడ్డల కోసం ఉపయోగిస్తుంటారు.
Read Also : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్
ఫార్మ్‌లో, యానిమల్ మాస్క్‌లు ధరించిన కల్టిస్ట్‌లు, మనుషులను కసాయిలా చంపుతూ, వారి మాంసాన్ని క్యాటరింగ్ బిజినెస్ కోసం వాడతారు. నోరా, అలెక్ ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలెక్ ఒక బేర్ ట్రాప్‌లో చిక్కుకుని, మాస్క్డ్ మెన్‌చే తలపై రాయితో చంపబడతాడు. నోరా మరో బందీ అయిన యాష్లీతో కలిసి, ఒక జీప్ కీని కనిపెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ జీప్ ఆగిపోవడంతో మళ్లీ ఫార్మ్‌కు వెళతారు. చివర్లో ఒక భయంకరమైన సన్నివేశంతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. అదేమిటంటే, నోరా, యాష్లీని కల్టిస్ట్‌లు పట్టుకుని, వారిని పందుల్లా కాల్చి, ఒక విచిత్రమైన “లాస్ట్ సప్పర్” స్టైల్ డిన్నర్‌లో సర్వ్ చేస్తారు. ఇక కల్టిస్ట్‌ల మరో వేట కొనసాగుతుంది.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ది ఫార్మ్’ (The Farm) హాన్స్ స్ట్జెర్న్‌స్వార్డ్ దర్శకత్వం వహించిన అమెరికన్ కానిబల్ హారర్ సినిమా. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది. హాన్స్ స్ట్జెర్న్‌స్వార్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మించింది. ఇందులో నోరా యెస్సాయన్, అలెక్ గేలార్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు.