OTT Movie : విన్ డీజల్ యాక్షన్ స్టైల్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ హీరో నటించిన ఒక ఫాంటసీ యాక్షన్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రాచీన యుగాల నుండి ఆధునిక కాలం వరకు మంత్రగత్తెలను వేటాడే అమరత్వం కలిగిన కౌల్డర్ పాత్రని విన్ డీజల్ పోషించాడు. ఈ సినిమా మంత్రగత్తెలు, మాయాజాలం, ఒక రహస్య సంస్థతో కూడిన ప్రపంచంలో సెట్ చేయబడింది. ఈ సినిమా యాక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా యాక్షన్, ఫాంటసీ అభిమానులకు, ముఖ్యంగా విన్ డీజల్ ఫ్యాన్స్‌కు మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీ లో ఉందంటే
‘ది లాస్ట్ విచ్ హంటర్’ (The Last Witch Hunter) అనేది విన్ డీజల్ నటించిన ఫాంటసీ యాక్షన్ హారర్ సినిమా. దీనికి బ్రెక్ ఐస్నర్ దర్శకత్వం వహించారు. ఇందులో విన్ డీజల్, రోజ్ లెస్లీ, ఇలిజా వుడ్, మైఖేల్ కైన్, జూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ టీవీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. 108 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో ఈ సినిమాకి 5.9/10 రేటింగ్ ఉంది. $90 మిలియన్ బడ్జెట్‌తో లయన్స్‌గేట్, సమ్మిట్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా $146.9 మిలియన్ లు వసూలు చేసింది.
స్టోరీలోకి వేళ్తే
కౌల్డర్ (విన్ డీజల్) 800 ఏళ్ల ఒక విచ్ హంటర్. ప్రపంచంలోనే చివరి విచ్ హంటర్‌గా ఉంటాడు. మధ్య యుగాల్లో, అతను విచ్ క్వీన్ ను చంపినప్పుడు , ఆమె అతన్ని అమరత్వం శాపంతో బంధిస్తుంది. ప్రెజెంట్ న్యూయార్క్‌లో కౌల్డర్ “ఆక్స్ అండ్ క్రాస్” అనే రహస్య సంస్థతో కలిసి, మంత్రగత్తెలు మానవులతో సమతుల్యంగా జీవించేలా చూస్తాడు. అతనికి డోలన్ అనే ప్రీస్ట్ సహాయం చేస్తాడు. కానీ, డోలన్ హఠాత్తుగా చనిపోతాడు. కౌల్డర్‌కు ఇది సాధారణ మరణం కాదని అనుమానం వస్తుంది. అతను ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు.తన దర్యాప్తులో, కౌల్డర్‌కు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. విచ్ క్వీన్‌ను చంపినట్లు అతను అనుకున్నప్పటికీ ఆమె బతికే ఉంటుంది. బెలియల్ అనే శక్తివంతమైన వ్యక్తితో కలిసి, బ్లాక్ డెత్ ప్లేగ్‌ను విడుదల చేసి మానవ జాతిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంటుంది.
Read Also : 30 ఏళ్ల ఆంటీతో 23 ఏళ్ల కుర్రాడు… పెళ్ళైనా వదలకుండా… సింగిల్స్ డోంట్ మిస్