BigTV English
Advertisement

OTT Movie : దెయ్యం షార్ట్ ఫిల్మ్ తీస్తే… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ థ్రిల్లర్

OTT Movie : దెయ్యం షార్ట్ ఫిల్మ్ తీస్తే… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న, ఒక కొరియన్ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఒక దర్శకురాలు  హారర్ స్టోరీ కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో ఒక దెయ్యం తీసిన సినిమాగా చెప్పుకునే స్క్రిప్ట్ గురించి ఆమె తెలుసుకుంటుంది. ఆ తరువాత భయంకరమైన సంఘటనలు ఆమెకు ఎదురుపడతాయి. మొదట ఇది ఉత్సాహంగా అనిపించినా, తరువాత భయంతో పరుగుల పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ కొరియన్ హారర్-మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘Warning: Do Not Play’. 2019లో విడుదలైన ఈ సినిమాకి కిమ్ జిన్-వోన్ దర్శకత్వం వహించారు. ఇందులో సియో యే-జీ, జిన్ సియోన్-క్యూ, కిమ్ బో-రా, జీ యూన్-హో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సైకలాజికల్ హారర్, ఫౌండ్ ఫుటేజ్, మెటా-స్టోరీటెల్లింగ్ అంశాలతో తెరకెక్కింది. ఈ సినిమా ‘Ringu’ ‘Cigarette Burns’వంటి చిత్రాలతో పోల్చబడింది.  IMDb లో దీనికి 5.3/10 రేటింగ్ ఉంది. Shudder, Amazon Prime Video లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

పార్క్ మి-జంగ్ ఒక రూకీ హారర్ ఫిల్మ్ డైరెక్టర్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం, ఒక స్క్రిప్ట్‌ను రాయడానికి ఆమెకు రెండు వారాల గడువు మాత్రమే ఉంటుంది. ఆమె తన సినిమా కోసం ఒక మంచి కంటెంట్ ఉన్న హారర్ కథ వేటలో ఉంటుంది. ఈ క్రమంలో ఒక స్థానిక ఫిల్మ్ స్కూల్‌లో, ఒక దెయ్యం దర్శకత్వం వహించినట్లు పుకారు ఉన్న ‘వార్నింగ్’అనే ని షేధించిన సినిమా గురించి తెలుసుకుంటుంది. ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో, గుండెపోటు వంటి గందరగోళాన్ని కలిగించినందున దీనిని రద్దు చేశారు. అంతే కాకుండా, దానికి సంబంధించిన సభ్యులు కూడా ఒక ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

ఈ సినిమా గురించి మి-జంగ్‌ మరింత తెలుసుకోవాలనుకుంటుంది. ఇది ఆమెకు గొప్ప పేరుని తెస్తుందని ఆమె ఆశిస్తుంది. మి-జంగ్ తన స్నేహితుడు జూన్-సియో సహాయంతో, ఈ సినిమా గురించి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె ఫిల్మ్ స్కూల్‌లోని విద్యార్థులను కలుస్తుంది. ఆమె కిమ్ జే-హ్యూన్ అనే “వార్నింగ్” సినిమా దర్శకుడిని కనిపెడుతుంది. జే-హ్యూన్ ఆమెను ఈ సినిమాను మర్చిపోమని హెచ్చరిస్తాడు. దాని గతం గురించి హెచ్చరిస్తాడు. కానీ మి-జంగ్ దీని మీద ఉన్న మక్కువ ఆమెను ముందుకు నడిపిస్తుంది. మి-జంగ్, జే-హ్యూన్ రెసిడెన్స్‌కు వెళ్లి, “వార్నింగ్” ఫుటేజ్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను దొంగిలిస్తుంది. జూన్-సియో సహాయంతో, ఆమె ఈ ఫుటేజ్‌ను వీక్షిస్తుంది.

ఇందులో జే-హ్యూన్, అతని బృందం ఒక పాడుబడిన థియేటర్‌లో, షూటింగ్ సమయంలో ఒక దెయ్యం ను ఎదుర్కొన్న సన్నివేశాలు ఉన్నాయి. వీటి గురించి మరింత తెలుసుకోవడానికి, మి-జంగ్ పాడుబడిన థియేటర్‌కు వెళుతుంది. అక్కడ ఆమె టైమ్ లూప్ లో అనుకోకుండా జే-హ్యూన్ క్రూ సభ్యులు, అతీంద్రియ శక్తులచే చంపబడిన సంఘటనలను చూస్తుంది. ఇప్పుడు ఆమె కూడా ఒక అతీంద్రియ శక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. చివరికి మి-జంగ్ అతీంద్రియ శక్తి నుంచి బయట పడుతుందా ? ఈ దెయ్యం వెనుక వున్న స్టోరీ ఏమిటి ? ఆమె ‘వార్నింగ్’ సినిమాని మళ్ళీ తెరకెక్కిస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అబ్బాయే అసిస్టెంట్ గా కావాలనే లేడీ బాస్… ముసలాడే కదాని పనిలో పెట్టుకుంటే…

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×