Best Romantic Movies on OTT : ఓటీటీలో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమాలను చాలానే తెరపై చూశాం. హృదయాన్ని హత్తుకునే విధంగా ఫీల్ గుడ్ రొమాంటిక్ సినిమాలను తెరకెక్కించడంలో చాలామంది సౌత్ మేకర్స్ పర్ఫెక్ట్. అలాంటి మిస్ అవ్వకుండా చూడవలసిన రొమాంటిక్ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
నేను శైలజ (2016, తెలుగు)
రామ్ పోతినేని, కీర్తి సురేష్ నటించిన ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోయిన్ మొదట్లో హీరోతో గొడవ పడుతూ ఆ తర్వాత హీరోని ప్రేమించడం మొదలు మొదలు పెడుతుంది. ఈ మూవీలో రామ్ పోతినేని తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video), యూట్యూబ్ (YouTube) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
బెంగళూరు డేస్ (2014, మలయాళం)
ఈ మలయాళం చిత్రానికి అంజలి మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలి, నజ్రియా నజీమ్ నటించారు. లవ్, ఫ్రెండ్షిప్ కంటెంట్ తో ఈ మూవీని ప్రెసెంట్ చేశారు. బెంగళూరులో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తుల కలలు, వారి సంబంధాల ఆధారంగా ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Disney + Hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రేమలు (2024, మలయాళం)
ఈ మలయాళం మూవీ 2024లో సంచలనం సృష్టించింది. ఈ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాజిల్ సహకారంతో భావన స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేసింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Disney+Hotstar0), ఆహ (Aha) ఓటిటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
ఓ కాదల్ కన్మణి (2015, తమిళ్)
మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా నటించారు. వివాహానికి ముందే కలిసి జీవించాలి అనుకున్న ఈ జంటకి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను వీళ్ళు ఎలా అధిగమించారు అనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ (Disney+Hotstar), ఆహ (aha) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
లవ్ స్టోరీ (2021, తెలుగు)
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. విభిన్న మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, ప్రేమ ఆశయాల మధ్య భావోద్వేగ ప్రయాణంలో సాగుతూ ఉంటారు. ఈ మూవీ స్టోరీ మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది. పైన చెప్పిన ఆణిముత్యాలను మిస్ చేసుకోకుండా చూడండి. ఈ ఫీల్ గుడ్ మూవీస్ చూస్తున్నంతసేపు రిలాక్స్ గా ఫీల్ అవుతారు. మరి ఆలస్యం చేయకుండా పైన చెప్పిన సినిమాలపై ఓ లుక్ వేయండి.