OTT Movies: ప్రతి పండకు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ అన్నా రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఉగాదికి మాత్రం ఓటిటిలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఉగాది పండుగను మరింత కన్నుల పండుగగా చేసుకోవడానికి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆరు చిత్రాలు పండుగ రోజు చూసేందుకు సూటవుతాయి. కామెడీతో సరదాగా ఉండే సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ ఆరు సినిమాలు ఏంటి? ఏ ఓటీటీలో ఏ సినిమా రాబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం..
సంక్రాంతికి వస్తున్నాం..
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్ల వద్ద సక్సెస్ అయిన ఏ సినిమా మార్చి 1 న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. ఉగాది పండుగకు కాస్త నవ్వులు పండించాలి అనుకుంటే ఈ సినిమాని చూసేయండి..
తండేల్..
అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం తండేల్… కార్తికేయ 2 ఫ్రేమ్ డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామి సృష్టించింది..ఇటీవల ఈ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది..
మజాకా..
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ మజాకా.. రీతు వర్మ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీతో కాస్త నవ్వించారు కానీ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. అయితే ఈ నెల 28న ఈ ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోరావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ముఫాసా..
ముఫాసా అనేది హాలీవుడ్ చిత్రం.. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సింహాలే హీరోలుగా ఉన్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20వ తేదీన విడుదలైంది. ది లయన్ కింగ్‍కు ప్రీక్వెల్‍గా ఈ చిత్రం వచ్చింది. ముఫాసా తెలుగు వెర్షన్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వాయిస్ ను అందించారు.. బెర్రీ జెన్కిన్స్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది..
డ్రాగన్..
ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ డ్రాగన్.. ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.150కోట్లపైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది.. ఇందులో అనుపమ పరమేశ్వరన్ తో పాటు కాయదులోహర్ హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ఇటీవలే ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది.. ఈ ఉగాదిని మరింత అందంగా చేసుకోవాలంటే ఈ సినిమాని మీరు చూసేయొచ్చు..
ఇక వీటితో పాటుగా చివరగా బ్రహ్మానందం మూవీ.. బ్రహ్మానందం తాత పాత్రలో తన తనయుడు గౌతమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఓటీటీలో సందడి చేస్తుంది.. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం ఉగాది స్పెషల్గా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేసేయండి..