BigTV English

MI VS GT: బ్యాటింగ్ చేయనున్న గుజరాత్… పాండ్య మాస్టర్ ప్లాన్ !

MI VS GT: బ్యాటింగ్ చేయనున్న గుజరాత్… పాండ్య మాస్టర్ ప్లాన్ !

MI VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే 8 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ… బిగ్ ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.. గట్ల మధ్య ఇవాళ తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన…ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దింతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.


Also Read: Csk fans: చెన్నై కెప్టెన్ రుతురాజుపై దారుణంగా ట్రోలింగ్… చెత్త నిర్ణయాలు అంటూ!

వేదిక, టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్…. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ లో… గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూడవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కు సంబంధించిన ప్రతి మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ఉచితంగా అందిస్తున్నారు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రికార్డులు

ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్లో విజయం సాధించింది. అటు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించడం జరిగింది. అంటే ముంబై ఇండియన్స్ పైన గుజరాత్ టైటాన్స్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాల్టి మ్యాచ్లో కూడా గుజరాత్ చాలా బలంగా ఆడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా ఎంట్రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు హార్థిక్ పాండ్యా. ముంబై ఇప్పటికే మొదటి మ్యాచ్ ఆడినప్పటికీ… కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించాడు. గత సీజన్లో పడిన పెనాల్టీ కారణంగా ఈ సీజన్లో మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు హార్థిక్ పాండ్యా. అయితే ఇవాల్టి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆడబోతున్నాడు. హార్దిక్ పాండ్యా ఆడితే ముంబై ఇండియన్స్ కు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ తో పాటు అటాకింగ్ బ్యాటింగ్ చేయగలడు.

Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

ముంబై వర్సెస్ గుజరాత్ జట్ల వివరాలు

 

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(c), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు

 

 

 

 

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×