E-Paper
Advertisement

థియేటర్ ముఖం చూడకుండానే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. హంతకుడెవరో కనిపెట్టగలరా?

థియేటర్ ముఖం చూడకుండానే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. హంతకుడెవరో కనిపెట్టగలరా?
Advertisement

Telugu Crime Thriller: సాధారణంగా ఓ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కొంతకాలానికి ఓటీటీలోకి వస్తుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ లేకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తిని పెంచుతోంది. అదే ‘పంచనామా’ (Panchanama). వరుస హత్యలు, వాటి వెనుక దాగి ఉన్న మిస్టరీ, హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పంచనామా కథ మొత్తం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. నగరంలో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతుంటాయి. ఒక్కో హత్య వెనుక ఏదో ఒక లింక్ ఉన్నట్లు అనిపించినా, అసలు నిందితుడు ఎవరు అనే విషయం మాత్రం పోలీసులకు అంతుచిక్కదు. హత్యలు జరుగుతున్న తీరు, నేరాలకు సంబంధించిన ఆధారాలు దర్యాప్తును మరింత క్లిష్టంగా మారుస్తాయి.

Advertisement

ఒకవైపు వరుస హత్యలు నగరంలో భయాందోళనలు సృష్టిస్తుంటే, మరోవైపు ఈ కేసును ఛేదించేందుకు దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగుతారు. ముందు ఇదేదో రొటీన్ కేసుగా కనిపించినా, కేసు క్రమంగా అనేక అనుమానాలకు దారి తీస్తుంది. దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ ఒక్కో ఆధారం బయట పడుతుంది. అయితే ఆ ఆధారం నిజమైన హంతకుడి దగ్గరకు తీసుకెళ్తుందా, లేక మరో కొత్త మిస్టరీలోకి నెట్టేస్తుందా అనేది ఆసక్తికరంగా మారుతుంది.

ఇక ఈ సినిమాలో అసలు హైలైట్ ఏంటంటే… హంతకుడు ఎవరు అనే ప్రశ్నే. ప్రేక్షకులకు ముందుగానే సమాధానం చెప్పకుండా, అనుమానాలను ఒక్కో పాత్రపైకి మళ్లిస్తూ కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి ? ఈ నేరాలన్నింటికీ సంబంధం ఏమిటి? అసలు ఈ వరుస హత్యలకు సూత్రధారి ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమాను చివరి వరకు చూడాల్సిందే.

తెలుగు సినిమానే

Advertisement

ఈ సినిమాకు జాన్ రమేష్ దర్శకత్వం వహించారు. నువాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంశాలను ప్రధానంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా హంతకుడి గుర్తింపును చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచడం ఈ కథలో ఆసక్తిని పెంచే అంశంగా కనిపిస్తుంది. థియేటర్ రిలీజ్ లేకుండానే ఓటీటీలోకి రావడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. పెద్దగా ప్రచారం లేకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రావడంతో, కొత్తగా ఏదైనా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌.

‘పంచనామా’ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉచితంగా అందుబాటులో లేదు. ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే చూడగలిగేలా ఉంది. అంటే ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నప్పటికీ సినిమాను చూడటానికి విడిగా రెంటల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, వరుస హత్యలు, మిస్టరీ, హంతకుడి కోసం జరిగే వేట వంటి అంశాలతో సాగే సినిమాలు ఇష్టమైతే ‘పంచనామా’ను ఒకసారి ట్రై చేయొచ్చు. మరి ఇన్ని హత్యల వెనుక ఉన్న అసలు హంతకుడు ఎవరు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటే మూవీని డోంట్ మిస్.

Read Also: 6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ

Related News

రాజకీయాల్లో ఎదిగిన రౌడీ… గెలిచిన రాత్రే హత్య.. అసలు చంపిందెవరు?

రిటైర్ అయ్యాక ఇంట్లో నరకం చూపించాడు… కోడలు ఇచ్చిన ట్రీట్‌మెంట్ చూస్తే నవ్వాపుకోలేరు

This Week OTT Releases : మూవీ లవర్స్ కు జాతరే.. ఓటీటీల్లోకి 22 సినిమాలు..!

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న చెన్నై లవ్ స్టోరీ!

హోర్డింగ్ లోపల వ్యక్తి నివాసం.. నెట్‌ ఫ్లిక్స్ వింత ప్రచారం!

భార్య కోసం దెయ్యంగా మారిన భర్త… గోడలో దాచిన చీటీతో అదిరిపడే ట్విస్ట్

70 ఏళ్ల బామ్మకు పెళ్లి… మనవడు చేసిన పని తెలిస్తే నవ్వు ఆపుకోలేరు

Big Stories

Advertisement
×