E-Paper
Advertisement

6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ

6 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 19 కోట్లు కొల్లగొట్టింది.. ఇప్పుడు ఓటీటీలోకి ఈ హారర్ కామెడీ
Advertisement

Marathi Horror Comedy: హారర్ సినిమాలతో భయపెట్టడమే కాదు.. అదే భయాన్ని కామెడీగా మార్చి ప్రేక్షకులను నవ్వించగలిగితే ఎలా ఉంటుంది ? పైగా కేవలం 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, దానికి మూడు రెట్లకు పైగా వసూళ్లు సాధిస్తే ? అలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మరాఠీ హారర్ కామెడీ ‘తుంబాడ్చి మంజుల’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కొంకణ్ తీర ప్రాంతంలోని ఓ ప్రశాంతమైన పల్లెటూరిలో కేశవ్ అనే వ్యక్తి ఉంటాడు. అప్పులు, తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడేందుకు అతను ఊరి ప్రజల ముందు ఓ వింత నాటకం మొదలుపెడతాడు. తన ఒంట్లోకి ‘మంజుల’ అనే దెయ్యం ప్రవేశించిందని అందరినీ నమ్మిస్తాడు. కేశవ్ చెప్పిన మాటలను ఊరి ప్రజలు నిజమే అనుకుంటారు. దీంతో భయం, వదంతులు ఊరంతా వ్యాపిస్తాయి. దెయ్యాన్ని వదిలించేందుకు బాబాలు, మాంత్రికులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది.

Advertisement

కేశవ్ సరదాగా చెప్పిన చిన్న అబద్ధం కాస్తా ఊరి మొత్తాన్ని కుదిపేసే పెద్ద కథగా మారుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. మంజుల అనే యువతి నిజంగానే ఊరిలోకి అడుగు పెడుతుంది. దీంతో కేశవ్ చెప్పిన దెయ్యం కథలో ఎంత నిజం ఉందనే ప్రశ్న మొదలవుతుంది. ఆమెకు కేశవ్ కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి ? అతని అమ్మమ్మ మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? కేశవ్ అబద్ధం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

మామూలు కామెడీ కాదు

‘తుంబాడ్చి మంజుల’ (Tumbadchi Manjula) లో హారర్‌తో పాటు పల్లెటూరి వాతావరణం, మూఢనమ్మకాలపై వ్యంగ్యం, సిట్యుయేషనల్ కామెడీ బాగా బాగుంటాయి. దెయ్యం ఉందని భయపెట్టే ప్రయత్నం నుంచి మొదలై.. ఆ దెయ్యం నిజంగానే వచ్చిందా అనే ఉత్కంఠ వరకు కథ ఆసక్తిగా సాగుతుంది. ఓం భూత్కర్, జితేంద్ర జోషి, సాయి తాంహంకర్, మకరంద్ అనాస్పురే, ఉషా నాదకర్ణి తదితరులు ఇందులో నటించారు. ముఖ్యంగా హారర్‌ను సీరియస్‌గా కాకుండా హాస్యంతో మిక్స్ చేసిన విధానం ఈ సినిమాలో అదిరిపోతుంది. అంతేకాదు… 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, 19.17 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం, అలాగే IMDbలో 7.4 రేటింగ్ అందుకోవడం సినిమాకు స్పెషాలిటీ. ప్రస్తుతం ZEE5లో ‘తుంబాడ్చి మంజుల’ మరాఠీ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. 2026 ఆగస్టు 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

Advertisement

Read Also: పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×