E-Paper
Advertisement

OTT Movie : మనుషుల్ని మాత్రమే వేటాడే మిస్టీరియస్ జీవి… ఆ ఒక్క అమ్మాయి చేతిలోనే మానవ జాతి భవితవ్యం

OTT Movie : మనుషుల్ని మాత్రమే వేటాడే మిస్టీరియస్ జీవి… ఆ ఒక్క అమ్మాయి చేతిలోనే మానవ జాతి భవితవ్యం
Advertisement

OTT Movie : ఓటీటీలోకి సరికొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, రక్త పిశాచాలతో పరుగులు పెట్టించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా భయపెడుతోంది. ఈ కథలో భూమి మీదకి వచ్చిన భయంకరమైన క్రీచర్స్ మనుషుల్ని వేటాడి చంపుతుంటాయి. ఇలాండ్ లో ఉన్న ఒక ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుందనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన అమెరికన్ సై-ఫై యాక్షన్ హారర్ సినిమా పేరు ‘వరల్డ్‌బ్రేకర్’ (World Breaker) బ్రాడ్ ఆండర్సన్ దర్శకత్వంలో మిల్లా జోవోవిచ్, లూక్ ఎవాన్స్, బిల్లీ బౌలెట్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. 2025 నవంబర్ 5న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భూమి మీదకి డెవిల్స్ ప్రపంచం నుంచి మనుషుల్ని కట్ చేసి తినేసే రక్త పిశాచులు వస్తాయి. పెద్ద రెక్కలు, కోరలు, షార్ప్ క్లావ్స్ తో ఇవి భయంకరంగా ఉంటాయి. వీటి వల్ల ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది. నగరాలు ధ్వంసమయ్యాయి. మానవులు దాక్కుని సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే హీరో తన కూతురికి రోజూ ట్రైనింగ్ ఇస్తాడు. గన్ షూటింగ్, నైఫ్ ఫైటింగ్, మాన్‌స్టర్స్ వీక్‌నెస్‌లు చెబుతూ సర్వైవల్ స్కిల్స్ ఆమెలో పెంచుతాడు. అతను కూతురికి ఈ ప్రపంచం చాలాసార్లు బ్రేక్ అయింది బేబీ. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వినాశనం వస్తుంటుంది. ఇప్పుడు రక్త పిశాచుల వల్ల వినాశనం మొదలైందని ఆమెకు మోటివ్ ఇస్తుంటాడు. అతని భార్య ఒక సైంటిస్ట్. వీళ్ళంతా ఒక ఐలాండ్ లో సేఫ్ అనుకున్నా, ఒక రోజు మాన్‌స్టర్స్ ట్రాక్ చేసి వస్తాయి.

Read Also : మగాళ్లను ముక్కలుగా కోసే కత్తిలాంటి అమ్మాయి… ఈ హిట్టు మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ పేరెత్తితే ఒట్టు

Advertisement

అక్కడ ఒక పెద్ద మాన్‌స్టర్ అటాక్ చేస్తుంది. వీళ్ళు మాన్‌స్టర్ ని గన్స్‌తో షూట్ చేస్తుంటారు. హీరో కూతురిని కాపాడుతూ ఫైట్ చేస్తాడు. కానీ వాటి వైరస్ కారణంగా అతని భార్య కూడా మాన్‌స్టర్‌గా మారుతుంది. కళ్లు ఎర్రబడతాయి, రెక్కలు పెరుగుతాయి. ఈ స్టోరీ ఇప్పుడు మరింత భయంకరంగా మారుతుంది. చివరికి వీళ్ళు మాన్‌స్టర్ అటాక్ నుంచి బయట పడతారా ? హీరో భార్య మాన్‌స్టర్‌గా మారి ఏం చేస్తుంది ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×