BigTV English

OTT Movie : జాంబీ సునామిలో చిక్కుకుపోయే దీవి… ఈ అరాచకం చూసి తట్టుకోవడం కష్టం భయ్యా

OTT Movie :  జాంబీ సునామిలో చిక్కుకుపోయే దీవి… ఈ అరాచకం చూసి తట్టుకోవడం కష్టం భయ్యా

OTT Movie : జాంబీ కథలతో వచ్చిన సినిమాలు, సృష్టించే భయంకరమైన రక్తపాతాలను చూడటం కాస్త కష్టంగానే ఉంటుంది. అయితే ఈ సినిమాలు కూడా ప్రేక్షక ఆదరణను బాగా పొందాయి. హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాలు వచ్చాయి. జాంబీ రెడ్డి మూవీ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీలో జాంబీల సునామీనే ఉంటుంది. ఈ జాంబీలు సృష్టించే అలజడితో వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘జాంబీ టైడల్ వేవ్’ (Zombie tidal wave). జాంబీలు సముద్రం నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక జాలరి తన శక్తి మేరకు ప్రతి ఒక్కరినీ కాపాడటానికి ప్రయత్నిస్తాడు. అయితే, త్వరలోనే, జాంబీలతో నిండిన ఒక అలల సునామి భూభాగంలోకి దూసుకెళ్లి భయంకరమైన వాతావరణం సృష్టిస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సముద్రంలో ఒక జంట వెకేషన్ కి ఎంజాయ్ చేయడానికి వస్తుంది. కాస్త లోపలికి వెళ్ళాక ఒక జాంబీ వీళ్ళని అటాక్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్లు సముద్రంలో పడిపోతారు. మరోవైపు హీరో చేపలు పట్టడానికి తన ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి వస్తాడు. వీళ్లు సముద్రంలో హంటింగ్ చేస్తుండగా, ఒక జాంబి వీళ్ళపై అటాక్ చేస్తుంది. అయితే వీళ్ళు ఆజాంబిని మళ్లీ సముద్రంలోకి తోసేస్తారు. ఆ ప్రాంతం నీలం రంగుతో ఏదో మెరుస్తూ ఉంటుంది. తమ దగ్గర ఉన్న కెమెరాలను సముద్రంలోకి పంపుతారు. అక్కడ ఏదో మనిషి ఆకారం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో జాంబీలు ఉన్నాయని అనుమానిస్తాడు హీరో. అయితే డేవిడ్ ఈ సముద్రంలో అవి ఎలా ఉంటాయని కొట్టి పడేస్తాడు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద అలలతో ఒక సునామీ వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి బోట్ ని స్పీడ్ గా నడుపుతాడు హీరో. సునామీ వేగం ఎక్కువగా ఉండటంతో బోట్ కూడా మునిగిపోతుంది.

ఆ సునామీలో నుంచి చాలా జాంబీలు భూభాగంలోకి వస్తాయి. దొరికిన వాళ్ళని దొరికినట్టుగానే కొరికేస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే హీరో భార్య ఒక డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. హీరో కూతురు తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి కూడా జాంబీలు వచ్చి బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి. హీరో ఒకపక్క జాంబీ లతో పోరాడుతూ, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలనుకుంటాడు. చివరికి హీరో జాంబిల నుంచి తప్పించుకుంటాడా? తన కుటుంబాన్ని రక్షించుకుంటాడా? ఈ జాంబీలను ఎలా కట్టడి చేస్తారు? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘జాంబీ టైడల్ వేవ్’ (Zombie tidal wave) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×