‘బిగ్ బాస్’ సీజన్ 8లోని కొత్త ముఖాలను జనాలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్నవారిలో లావణ్య-రాజ్ తరుణ్‌ల వివాదంతో శేఖర్ భాష ఎక్కడా లేని పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు ఇంట్లో చాలా కూల్‌గా ఉంటూ జోకులేస్తూ.. షాకులిస్తున్నాడు. అమ్మాయిల్లో మాత్రం సోనియా ఆకుల ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. సోనియా ఇద్దరు కంటెస్టెంట్స్‌తో పులిహోర కలుపుతోంది.
ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్‌లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. సోనియా ఇద్దరు కంటెస్టెంట్స్‌తో పులిహోర కలుపుతోంది.
నిఖిల్, పృధ్విలతో క్లోజ్‌గా ఉంటూ.. ప్రేక్షకుల ఫోకస్‌ను తనపై మలచుకుంటోంది. ఇవన్నీ చేస్తూనే.. మరోవైపు నీతులు కూడా బాగానే వల్లిస్తోంది. అయితే, ఇటీవల నిఖిల్‌తో మాట్లాడుతూ.. స్మోకింగ్ మానేస్తే ఏమైనా ఇచ్చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతమాట అనేశావేంటి సోనియా అని చాలామంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అయితే, ‘బిగ్ బాస్’లో సోనియాకు.. బయట సోనియాకు చాలా తేడా ఉంది. ఇందుకు ఆమె ఫొటోలే నిదర్శనం.
సోనియా తన ఇన్‌స్టాగ్రమ్ ఫొటోల్లో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తోంది. అచ్చతెనుకు ఆడపడుచులా ఆమె డ్రెస్సింగ్ ఉంటుంది.
అంతేకాదు.. ఆమె ఏం చెప్పాలనుకున్నా.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుందట. ఇది సరిపోదా.. ఆమెకు ఓటు వేసేందుకు!