E-Paper
Advertisement

రాను రానంటూనే..! ఎన్టీఆర్‌ను వెనుకేసుకొచ్చి.. బాబుగారిని దెప్పి పొడిచి..!

రాను రానంటూనే..! ఎన్టీఆర్‌ను వెనుకేసుకొచ్చి.. బాబుగారిని దెప్పి పొడిచి..!
Advertisement

రాజ‌కీయాల్లోకి రాన‌ని క్లారిటీ ఇచ్చాడు. వంద‌తులు న‌మ్మొద్ద‌ని కోరాడు. అదంతా ఉత్త ప్ర‌చార‌మేన‌ని లైట్‌గా తీసుకోమ‌న్నాడు. నేను చెప్పేదాకా ఏదీ న‌మ్మొద్ద‌ని కూడా చెప్పుకున్నాడు. కానీ చివ‌ర్లో ఎన్టీఆర్ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించే హ‌క్కు ఓ ఒక్క‌రికీ లేద‌న్నాడు. అయ్‌.. ఇదేం ట్విస్టు చివ‌రాఖ‌ర్లో! ఎవ‌రికీ అర్థం కాలే. అంతు చిక్క‌లే.

వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా.. వ‌స్తే గిస్తే నేను చెబుతా క‌దా అంటున్నాడు. అంటే వ‌స్తాడ‌న్న‌మాటే క‌దా! ఓహో మ‌రి ఇప్పుడే రానంటున్నాడా? అంటే ఇప్పుడు రాక‌పోయినా.. ఇంకొన్ని రోజులకైనా త‌ప్ప‌క వ‌స్తాన‌ని ఇండికేష‌న్ ఏమైనా ఇస్తున్నాడా? రావ‌డం ప‌క్కారోయ్‌… అని తొడ‌గొట్టి చెప్పిన‌ట్టే చెప్పి.. ఇప్పుడు నేనేం చెప్ప‌డం లేద‌ని తెలివిగా త‌ప్పించుకుంటున్నాడా?

Advertisement

జూనియ‌ర్ ఎన్టీఆర్ కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అందులో సారాంశం ఇలాగే పైన నేను చెప్పిన‌ట్టుగా.. జ్యోతిల‌క్ష్మి చీర విడిపించీ విడిపించ‌న‌ట్టు.. చూపించీ చూపించ‌న‌ట్టుగా.. ఉంది. ఇది నేన‌డం లేదు.. ఏపీ రాజ‌కీయాల్లో ఇదే అంశం ప్ర‌స్తుతం చ‌ర్చకు వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంత‌కు మించి ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవ‌రో రా.. ఎన్టీఆర్‌…! అనే స్వ‌చ్చంధ సంస్థ పెట్టి.. ఇందులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను లాగార‌నేది ఆయ‌న కార్యాల‌య వ‌ర్గాల స‌మ‌చారం.

ఊరు వాడ అని ఏకంగా ఓ ప్రోగ్రామే సెట్ చేశారు. ఓ వంద కోట్లు ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు పెట్ట‌బోతున్నాం.. ఈనెల 20న ప్రారంభం.. దీనికి రెండు రోజుల ముందు తిరుప‌తిలో ప్రెస్‌మీట్ ఉంటుంది… అని లీకుల మీద లీకులిచ్చారు. జూనియ‌ర్ త‌రుపున ఎవ‌రూ చ‌ప్పుడు చేయలేదు. మీడియా మొత్తం కోడై కూసే స‌రికి ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డి నిద్ర లేచాడు జూ.

Advertisement

ఓ ప్రెస్ రిలీజ్ చేపించాడు. అవి అచ్చంగా బాల‌య్య బాబు డైలాగుల్లా అర్ధ‌మ‌యి అర్థం కాక అన్నట్టుగా ఉన్నా.. ఏదో ఒక మెసేజ్ అయితే చివ‌ర‌గా తెల‌సీ తెల‌వ‌కుండా.. క‌నిపెట్టండిరా చూద్దాం అని మీడియా మెద‌డుకు ప‌దును పెట్టిన‌ట్టుగా ఫీల‌ర్ వ‌దిలాడు. అదేమిటో తెలుసా? ఎన్టీఆర్ పేరే ఉచ్చ‌రిండానికి ఎవ‌నికీ అర్హ‌త లేద‌నే విధంగా ఉంది. అంత డెప్త్ ఉంది ఆ డైలాగులో.

ఆయ‌న త‌రపున ప్రాతినిథ్యం వ‌హించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నాడు. అంటే ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్‌ది కాద‌నా? లేదా చంద్ర‌బాబు ఎన్టీఆర్ పేరు చెప్ప‌డానికి అర్హుడు కాడ‌నా? వ‌స్తే గిస్తే.. చెబితే గిబితే… తాను త‌ప్ప ఎవ‌రికీ ఆ హ‌క్కు లేద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అనుకోవాలా? తాను క‌చ్చితంగా రాబోతున్నాను.. కానీ ఇప్పుడు కాదు.. వ‌స్తా.. త‌ప్ప‌కుండా.. అదీ ఎన్టీఆర్ పేరుతోనే.. అది నాకే చెల్లుబాటు అవుతుంది. నా కొత్త పార్టీకే అది హ‌క్కుగా ఉంటుంద‌ని ఇండికేష‌న్ ఇచ్చి..బాబులో ఇరిటేష‌న్ తెప్పించి.. బాల‌య్య‌ను ఇర‌కాటంలో పెట్టి.. ప్ర‌తిప‌క్షాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే సంకేత‌మిచ్చి… న‌న్ను ఆప‌డం మీ త‌రం కాద‌ని తొడ‌లు చ‌రిచి.. ! ఇంత డెప్త్ ఉందా? ఏమో ఉంద‌నే అనిపిస్తుంది. ఉంద‌నే అనుకోవాలి మ‌రి.

Related News

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

ఉద్యమాల ఆయువుపట్టు మీద పాలకుడి దాడి! ప్రశ్నించే గొంతులకు వేదిక లేకుండా చేసే కుయుక్తులు..! ధర్నాచౌక్‌లకు తాళాలేయడం.. రోగానికి మందు కాదు..!

హస్తిన పోరులో తెలంగాణ కీ రోల్‌! రేవంత్‌పై భారీ నమ్మకం పెట్టుకున్న ఏఐసీసీ! ఢిల్లీ పోరులో టీ కాంగ్రెస్‌ హవా!

తమిళనాడు టూర్‌లో మోడీ, విజయ్‌ల ఎడముఖం పెడముఖం! పరువు పోకుండా మోడీ తండ్లాట..! మౌనంగా ఉంటూ ఇమేజీని డ్యామేజీ చేసేలా విజయ్‌..!

Big Stories

Advertisement
×