E-Paper
Advertisement

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!
Advertisement

నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా… చూస్కుందా0 రారా నీ ప్ర‌తాప‌మో.. నా ప్ర‌తాప‌మో! బాల‌య్య బాబును మించిన ప‌వర్‌ఫుల్ డైలాగుల‌కు సిరిసిల్ల మార్మోగింది. ద‌ద్ద‌రిల్లింది. రామ‌న్న బ‌ట్ట‌లూడ‌దీసినంత ప‌నిచేసిన క‌విత మాట‌లు, విమ‌ర్శ‌ల‌కు అక్క‌డి జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు. అవును.. నిజ‌మే క‌దా! అనే చ‌ర్చ మొద‌లైంది అక్క‌డ‌. కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీదే దాడి చేశారు క‌విత‌. సిరిసిల్లలో టీఆరెస్ జెండా పండుగ వేడుక‌కు హాజ‌రైన ఆమె… అక్క‌డే నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్‌ను బ‌రిబాత‌ల నిలిపినంత ప‌ని చేశారు.

ఆయ‌న‌ను వీకెండ్ ఎమ్మెల్యేగా సంబోధించారు. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చుట్ట‌పు చూపుగా వ‌చ్చి పోతుంటార‌ని కూడా అన్నారు. ప‌ద్మ‌శాలీల క‌ష్టాల‌ను కనుల ముందుంచిన ఆమె… నేరెళ్ల బాధితుల అంశాన్ని బ‌లంగా లేవ‌నెత్తిన ఆమె.. కేటీఆర్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గట్టారు. చేత‌గానిత‌నాన్ని తెలంగాణ స‌మాజానికి తెలియ‌జెప్పారు. అస‌మ‌ర్థ ఎమ్మెల్యేనే కాదు… సీఎం త‌రువాత సీఎంగా చలామ‌ణి అయ్యార‌ని.. కానీ సిరిసిల్లా జ‌నానికి ఏం చేయ‌లేక‌పోయార‌ని ఉన్న‌దున్న‌ట్టు కేటీఆర్ లోపాల‌ను బ‌య‌ట‌పెట్టారు క‌విత‌.

Advertisement

ఇది ఎవరూ ఊహించ‌ని ప‌రిణామం. క‌విత క‌రెక్టు స‌మ‌యం కోసం వేచి చూసిన‌ట్టుగా అనిపించింది. సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక దాడి మొద‌లైంది. మామూలుగా కాదు.. ఏకే 47తో శ‌రీరం తూట్లు పొడిచేలా ద‌డ‌.. ద‌డ‌.. ద‌డ‌… ద‌డ‌.. మ‌ని ఫైరింగ్ చేసి వ‌దిలారు క‌విత‌. ఇది కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే.. సుమీ..! ఇంకా ముందుంది అస‌లు సినిమా! పిచ్చ‌ర్ అబి బాకీ హై! అన్న‌ట్టుగానే ఉంది ఆమె స్టైల్‌. పాపం.. ఇవాళ రాత్రి.. కేటీఆర్‌కు కాళ‌రాత్రే అవుతుందేమో! క‌వితంటే ఏమ‌నుకున్నారు..! ఓ ఆడ‌పులి అని బీఆరెస్ పార్టీకే హ‌డ‌లు పుట్టించి.. ద‌డ లేపారు క‌విత‌.

ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌కు కూడా నిద్ర ప‌ట్ట‌దు ఇవాళ. ఆడ‌బిడ్డంటే అంత అలుసా..! కొడుకంటే ప్రేముండొచ్చు.. కానీ.. ఆడపిల్ల‌ను అంత‌లా అవ‌మానించి పార్టీ నుంచి గెంటేస్తే.. ఆమె క‌వితే అయితే..! ఎలా ఉంటుందో వారికి తెలియ‌జేశారు క‌విత ఇవాళ‌. సీఎం త‌రువాత సీఎం…. ఈ మాట చాల‌దా… కేసీఆర్, కేటీఆర్‌లిద్ద‌రూ ప‌దేళ్ల పాటు ఎలా ఏలారో? ఎందుకు ఓడిపోయారో? ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.

Advertisement

సిరిసిల్లా కేంద్రంగా ఆమె కేటీఆర్ వైఫ‌ల్యాల వ‌రుస క్ర‌మాన్ని మాత్ర‌మే వివ‌రించారు. ఇదే తండ్రీకొడుకుల‌కు నిద్ర లేని రాత్రుల‌ను మిగిల్చింది. మ‌రి తెలంగాణ వ్యాప్తంగా జ‌రిగినవ‌న్నీ వ‌రుస‌బెడితే.. మాస్‌తో పెట్టుకుంటే మ‌డ‌త‌డి పోద్ది..! అని ర‌వితేజ మాస్ సాంగ్‌లా జ‌నాల‌కు తొంద‌ర‌గా క‌నెక్ట‌యి.. అస‌లు సంగ‌తి ఇద‌ని అంతా తెలుసుకునే రోజులు ఎంతో దూరంలో లేవ‌నిపిస్తోంది.

కాళేశ్వ‌రం నీళ్లు ఏవీ అని అడిగారు. ఏం చెప్పారు? ఏం చేశారు? అని నిల‌దీశారు. దళిత‌, బీసీ వ‌ర్గాల ఉసురు తీశార‌ని శాప‌నార్ధాలు పెట్టారు. రైతు డిస్కం అంటే చ‌ప్పుడు చేయని అంశాన్ని గుర్తు చేసి.. కేటీఆర్ ఎంత చైత‌న్య‌వంతుడో జ‌నానికి తెలియ‌జేశారు. తెలంగాణ అనే ప‌దాన్నే వ‌దిలేసిన బీఆరెస్‌.. ఇక్క‌డి జ‌నం ఆద‌ర‌ణ‌ను కూడా కోల్పోయింద‌ని చెబుతూనే.. టీఆరెస్‌గా .. తెలంగాణ ఇంటి పార్టీగా నేను మీ ముందుకు వ‌చ్చాన‌ని చెప్పారు క‌విత‌.

త‌న పాంచ‌జ‌న్యం ఉద్దేశం వివ‌రించి జ‌నం ప‌డుతున్న బాధ‌ల‌ను ప‌రిష్కరించే త‌న పార్టీ పాల‌సీని వివరించి ఆక‌ట్టుకున్నారు. అటు వైపు నీ వాళ్లే.. ఇటు వైపు నీ వాళ్లే.. యుద్దం ఎలా చేయ‌డం…? ధ‌ర్మం వైపు నిలిచి పోరాట‌మే శ్రీ‌కృష్ణుడి ఉప‌దేశం.. అదే త‌ను చేస్తున్న‌ద‌ని ఆమె చెప్పిన విధానం అంద‌రికీ స‌బ‌బ‌నే అనిపించింది.

క‌విత ప్ర‌తీ అడుగు, మాట్లాడిన ప్ర‌తి మాట శ‌బ్బాష్ అనేలానే ఉన్నాయ‌న్నారు జ‌నం. క‌విత స‌క్సెస‌య్యారు. ఇక మ‌రింత దూకుడుగానే ఆమె ముందుకు సాగ‌నున్నారు. అది త‌ట్టుకోవ‌డం వారి త‌ర‌మ‌వుతుందా? అనేది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో న‌డుస్తున్న డిస్క‌ష‌న్‌!

Related News

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

కుక్క‌ను నిలబెట్టినా గెలుస్తాం.. అహంకార‌పు మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు కాలం చెల్లు!

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

Big Stories

Advertisement
×