E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రాజ‌కీయాల‌ను మార్చేస్తున్న హిందుగాళ్లు.. బొందుగాళ్లు.. !

రాజ‌కీయాల‌ను మార్చేస్తున్న హిందుగాళ్లు.. బొందుగాళ్లు.. !
Advertisement

ఈ డైలాగ్ ఎక్క‌డో విన్నంట్టుంది క‌దూ! క‌రెక్టే.. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన డైలాగే.ఈ డైలాగు ఎంత వైర‌ల్ అయ్యిందో.. దాన్ని బీజేపీ ఎంత‌లా తిప్పి తిప్పి.. త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యిందో అంద‌రికీ తెలుసు. బీఆరెస్‌ను కోలుకోని దెబ్బ‌కొట్టింది కూడా ఇదే ఆనాడు. అది బీఆరెస్ నేత‌ల‌కూ తెలుసు. ప్ర‌ధానంగా కేసీఆర్‌కు. ఇప్పుడిదెందుకు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది? అనుకుంటున్నారా? దీన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెస్తున్న‌ది తెలంగాణ బీజేపీ. త‌మిళ‌నాడులో డీఎంకే ఓట‌మికి.. అప్పుడు కేసీఆర్ ఓడిన నేప‌థ్యానికి ముడి పెట్టి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స్టాలిన్‌, అత‌ని కుమారుడు ఉద‌య్ స్టాలిన్‌.. నాస్తికులు. హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచే విధంగా ప‌లు వేదిక‌ల మీద వీరిద్ద‌రూ మాట్లాడ‌టం కూడా చాలా మంది న‌చ్చ‌లేదు.

ప్ర‌ధానంగా బీజేపీ దీన్ని అస్త్రంగా వాడుకున్న‌ది. కానీ అక్క‌డ గెలిచింది బీజేపీ కూట‌మి కాదు.. విజ‌య్ పార్టీ టీవీకే. విజ‌య్ దైవ భ‌క్తితో ఉన్నాడు కాబ‌ట్టి గెలిచాడు.. అదే స్టాలిన్ దైవాన్ని దూషించాడు కాబ‌ట్టే ఓడాడు. ఇక్క‌డ కేసీఆర్ కూడా అదే రీతిలో మాట్లాడి ఓట‌మి పాల‌య్యాడు అంటూ.. తెలంగాణ బీజేపీ ఈ రెండు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల నేప‌థ్యాన్ని గుర్తు చేస్తూ .. బీజేపీకి బూస్టింగ్ ఇచ్చేలా.. హిందుత్వ వాదాన్ని బ‌లంగా తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. కేసీఆర్ ఆనాడు ఈ ప‌దాన్ని వాడింది ఆవేశంలో. అదీ బీజేపీని ఇరుకున పెడ‌దామ‌ని. కానీ దీన్నిబీజేపీ కేసీఆర్ పైనే అస్త్రంగా వాడింది. బీజేపీకి అనుకూలంగా, మ‌రింత బ‌లాన్ని చేకూర్చే విధంగా హిందూ ఓట్లు పోల‌రైజ్ అయ్యే విధంగా మ‌లుచుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యింది.

Advertisement

అస‌లు కేసీఆర్ ఈ మాట‌న‌డం వెనుక ఉద్దేశ్యం ఇదీ… మాకు దైవం అంటే భ‌క్తి లేదా? మేమూ చేస్తాం పూజ‌లు…దేవుళ్ల‌ను మొక్కుతాం.. అవ‌న్నీ మేము చెప్పుకోవాలా? దీనికి మీ ప‌ర్మిష‌న్ ఏమ‌న్నా కావాలా? ఎన్నిక‌లు రాగానే మ‌త రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తూ.. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అని ఏవేవో మాట‌లు చెబుతారు! మేం హిందువులం కాదా.. మీ క‌న్నా మేమే ప‌క్కా హిందువులం..! ఇదీ ఆయ‌న ఆనాడు ఆవేశంతో కూడా ఆవేద‌నాభ‌రిత ప్ర‌సంగం. అంటే.. బీజేపీకి హిందూత్వ వాదం త‌ప్పితే.. ఇంకేం తెల‌వ‌దు.. ఎన్నిక‌ల స‌మయంలో రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాల‌తో హిందువుల‌కు మేమే దిక్కు.. మా పార్టీ దిక్కు.. ఎవ‌రూ లేరు… అనే విధంగా ప్ర‌చారం చేసుకుంటుంద‌ని, దీన్ని న‌మ్మొద్ద‌నేది ఆయ‌న జ‌నంతో అప్పీల్ చేసుకునే తీరులో ఆ మాట‌లు దొర్లాయి. కానీ అవే మాట‌లు కేసీఆర్ మీద త‌ప్పి కొట్టేందుకు బీజేపీ అస్త్రాలుగా వాడుకుంది.

హిందువుల‌ను కేసీఆర్ తిట్టాడు.. బొందుగాళ్లు అంటూ వ్యంగ్యంగా అన్నాడు… అత‌ను హిందు ద్రోహి .. అనే రీతిలో ప్ర‌చారం చేశారు. అవాక్క‌వ్వ‌డం కేసీఆర్ వంతైంది. ఇలా జ‌రుగుతుంద‌ని ఆయ‌న అనుకోలేదు. ఊహించ‌లేదు ఆ పార్టీ మొత్తం ఆనాడు డిఫెన్స్‌లో ప‌డింది. దీంతో న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో ఆయ‌న‌.. త‌ను ఆయుత చండీయాగం చేసింది… యాదాద్రిపై స్పెష‌ల్ ఫోకస్ పెట్టి అభివృద్ది చేసింది… అన్నీ ఫోటోల‌తో స‌హా స్పెష‌ల్ స్టోరీలు చేయించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. బీజేపీ దీన్ని బాగా వైర‌ల్ చేసింది. ఇదిప్పుడు స్టాలిన్ వైపు తిప్పుతున్నారు బీజేపీ నాయ‌కులు. స్టాలిన్, అత‌ని కుమారుడు ఉద‌య్ స్టాలిన్ ఇద్ద‌రూ హిందుత్వానికి వ్యతిరేకంగా ప‌లు సంద‌ర్భాల్లో మాట్లాడిన ఉదంతాలున్నాయి. ఇవి మ‌న‌సులో పెట్టుకున్న బీజేపీ నేత‌లు .. ఇప్పుడు ఆ పార్టీ ప‌త‌న‌మైన తీరును ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

అక్క‌డ మా పార్టీ గెల‌వ‌క‌పోయినా స‌రే, మీరు తుక్కు తుక్కు ఓడిపోవడం బాగైంది. మీకు గుణ‌పాఠం జ‌రిగింది.. అని సోష‌ల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు నాస్తిక‌త్వం ప్ర‌క‌టించుకోవ‌డం కూడా ఓ నైర‌మైంది. ప్ర‌ధానంగా తెలంగాణ‌లో. కేటీఆర్ నాస్తికుడు. దేవుళ్లు.. పూజ‌లు .. ఇవేవీ లెక్క చేయ‌డు. పాటించ‌డు. కానీ ఈ మ‌ధ్య కేటీఆర్ కూడా మారాడు. దైవ ద‌ర్శ‌నాల‌కు వెళ్తున్నాడు. పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాడు. బొట్టు పెట్టుకుంటున్నాడు. భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు అన్నీ చేస్త‌న్నాడు. ఇష్టం లేకున్నా. రాజ‌కీయాల కోస‌మే. అది అత‌నికి ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌తి ఒక్కరికీ తెలుసు. అంతే మ‌రి రాజ‌కీయాల్లో ఉండాలంటే… జ‌న బాహుళ్యంలో అంద‌రికీ చేరువ కావాలంటే అంద‌రి న‌మ్మ‌కాల‌ను పాటించాలె. ఆచ‌రించాలె.

అందుకే కేటీఆర్ కూడా మారాడు. ఇక్క‌డ స‌మ‌స్య లేదు. కానీ నేను నాస్తికుడిని క‌దా..? ఏ మ‌తం లేదు.. దేవుడు లేడు.. అని మాట్లాడితేనే అస‌లు తంటా వ‌స్తున్న‌ది. ఇక్క‌డ మ‌తాన్ని కించ‌ప‌ర‌చచ‌డ‌మే కాదు.. ఆ మ‌తాన్ని న‌మ్మే ఆ వ‌ర్గ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కూడా కించ‌ప‌రిచిన‌ట్టే.. మ‌రి ప్ర‌జా జీవితంలో ఉండి.. ఇలా వ్య‌క్తిగ‌త న‌మ్మ‌కాన్ని బాహాటంగా .. ఓపెన్‌గా చెప్పాల‌నుకోవ‌డ‌మే పెద్ద త‌ప్పుగా ప‌రిణ‌మిస్తున్న‌ది. నాగ‌రికత పెరుగుతున్నా.. సైన్స్ ఎంత‌గా అభివృధ్ది చెందుతున్నా.. అదే స్థాయిలో ఆథ్యాత్మిక‌త కూడా పెరుగుతూ వ‌స్తోంది. అందుకే రాజ‌కీయాల్లో ఇది కూడా కీల‌క భూమిక పోషిస్తూనే ఉంది.

Related News

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..!? హ‌రీశ్ నిన్నే…!

బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

Big Stories

×