E-Paper
Advertisement

పాకిస్తాన్ పోలికపై బీజేపీ దిద్దుబాటు చర్యలు: మంత్రి క్షమాపణ..!

పాకిస్తాన్ పోలికపై బీజేపీ దిద్దుబాటు చర్యలు: మంత్రి క్షమాపణ..!
Advertisement

Shobha Karandlaje: స్వేచ్ఛ బ్యూరో: పార్లమెంట్‌లో తెలంగాణ విభజనను పాకిస్తాన్ తో పోల్చడంపై కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే స్పందించారు. తేజస్వి సూర్య మాట దొర్లిందని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై తెలంగాణ ప్రజలు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమే మాట్లాడారు. తేజస్వి మాటలకు తాను కూడా బాధపడ్డానని ఆమె చెప్పారు. ఏప్రిల్ 17 భారత మహిళలకు ఒక బ్లాక్ డే అని ఆమె పేర్కొన్నారు. రాహుల్ మహిళలకు ధోకా ఇచ్చారని ఫైరయ్యారు. దక్షిణ భారత ప్రజలకు మోడీ మంచి చేయాలనుకున్నారని గుర్తుచేశారు. మహిళా బిల్ వీగిపోవడంతో కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా సంబురాలు చేసుకుందన్నారు. అసలు కాంగ్రెస్ లక్ష్యం ఏంటని శోభ ప్రశ్నించారు. దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రధాని పదేళ్ల కృషి..

లోక్ సభలో అమిత్ షా గంట టైమిస్తే.. కాంగ్రెస్ నేతల సదేహాలు తీరుస్తానని చెప్పారని, కానీ వారు ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ వెనుక ప్రధాని పదేళ్ల కృషి ఉందన్నారు. దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు ఆరోపించారని, కానీ మహిళా బిల్ విషయంలో దక్షిణ భారత దేశానికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని శోభ కరంద్లాజే విమర్శించారు. ఇప్పుడు ఉన్న ఎంపీ సీట్లను 50 శాతం పెంచుతామని లోక్ సభ సాక్షిగా అమిత్ షా చెప్పారని, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీ మహిళా నేతలు కూడా ఈ బిల్ పాస్ అవుతుందా అని అడిగారని ఆమె గుర్తుచేశారు. ఎందుకంటే వాళ్లకు కూడా వారి పార్టీలో అవకాశాలు దొరుకుతాయని భావించారన్నారు. కానీ.. లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రవర్తన అందరూ గమనించారని ఎద్దేవాచేశారు.

Advertisement

Also Read: సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..

ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడాలో రాహుల్ కు తెలియదని చురకలంటించారు. రాహుల్ కు ఏం మాట్లాడాలో ఎవరైనా చెప్పాలని సూచించారు. ఇండియా కూటమి నేతలు ఏం చేయాలని నల్ల వస్త్రాలతో నిరసన చేశారని కరంద్లాజే ప్రశ్నించారు. ఇంకా ఎన్నాళ్ళు ఒక మహిళా ఎంపీ, ఎమ్మెల్యే కాకుండా వేచి ఉండాలని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు నేఎరవేర్చలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఎన్నో హామిలిచ్చిందని, కానీ నెరవేర్చడంలో విఫలమైందన్నారు. తెలంగాణాను రేవంత్ రెడ్డి చీట్ చేశారని ఆమె విమర్శించారు. అందుకే రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పిక్ పాకెటర్ సీఎం రేవంత్ రెడ్డి అని శోభ కరంద్లాజే ఘటుగా స్పందించారు.

Advertisement

Also Read: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×