నటీనటులు : అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్‌ముఖ్, వైష్ణవీ ధన్‌రాజ్, సౌరభ్ శుక్లా, ఇలియానా డి’క్రూజ్ తదితరులు
దర్శకుడు : రాజ్ కుమార్ గుప్తా.
సంగీతం : అమర్ మొహిలే
సినిమాటోగ్రఫీ : అల్ఫోన్స్ రాయ్.
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభినవ్ శుక్లా.
విడుదల తేదీ : 2025 మే 1
రన్ టైమ్ : 2 గంటల 17 నిమిషాలు
Raid 2 Review : 2018లో విడుదలైన ‘రైడ్’ అనే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఈ “రైడ్ 2” (Raid 2). రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కింది. అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్‌ముఖ్, వైష్ణవీ ధన్‌రాజ్, సౌరభ్ శుక్లా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 1న థియేటర్లలోకి వచ్చింది. ఈ హిందీ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో అందుబాటులో ఉంది. సీక్వెల్ కావడంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ‘రెట్రో, హిట్’ సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే…
“రైడ్ 2″లో అజయ్ దేవ్‌గణ్ మళ్లీ ఐఆర్‌ఎస్ అధికారి అమయ్ పట్నాయక్‌గా కనిపిస్తాడు. ఈ ఆఫీసర్ నిజాయితీ, ధైర్యంతో అవినీతిని ఎదుర్కొంటాడు. ఈసారి కథ 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఈ సీక్వెల్ లో అమయ్ ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకుడు, అవినీతి వ్యాపారవేత్త గుండా రాయ్ (రితేష్ దేశ్‌ముఖ్)ని టార్గెట్ చేస్తాడు. గుండా రాయ్ పొలిటికల్ సపోర్ట్ తో అక్రమ సంపదను కూడబెడతాడు. అందుకే అమయ్ ఒక భారీ రైడ్ ద్వారా అతని అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోయాలని, అతన్ని ఎక్స్ పోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో హీరోకి అనేక సవాళ్లు, రాజకీయ ఒత్తిడులు, సమస్యలు ఎదురవుతాయి. అధికారంలో ఉన్న పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ జోలికి వెళ్తే ఇదంతా కామన్. మరి రాయ్ హీరోని, అతని ఫ్యామిలీని పెట్టిన ఇబ్బందులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి రాయ్ ని ఎదిరించి హీరో సాధించింది ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
కథ కొత్తదేమీ కాదు. సినిమా మొదటి సగం నెమ్మదిగా, డ్రాగ్ చేసినట్టు అన్పిస్తుంది. కథ సెటప్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ ద్వితీయార్థం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రితేష్ షా రాసిన స్క్రీన్ ప్లే రెండవ సగంలో ఉత్కంఠగా సాగుతుంది, ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. 1980ల నేపథ్యంను డైరెక్టర్ చక్కగా వాడుకున్నాడు. ఇక సినిమాలో కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. డైలాగ్ లు పవర్ ఫుల్ గా ఉన్నాయి. అల్ఫోన్స్ రాయ్ సినిమాటోగ్రఫీ, అమర్ మొహిలే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. రైడ్ సన్నివేశాలు, క్లైమాక్స్ విజువల్‌గా ఆకట్టుకున్నాయి.
అజయ్ దేవ్‌గణ్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో సినిమాను ముందుకు నడిపిస్తాడు. అతని డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను మెప్పిస్తుంది. కానీ విమర్శకులకు మాత్రం అజయ్ నటన రిపిటిటివ్‌గా అన్పిస్తుంది. రితేష్ విలన్‌గా అద్భుతంగా నటించాడు. ఆయన పాత్ర సినిమాకు డెప్త్ ను జోడించింది, అజయ్ తో తలపడే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్
అజయ్ దేవ్‌గణ్
దేశ్‌ముఖ్
డైలాగ్‌లు, స్క్రీన్‌ప్లే
స్క్రీన్ ప్లే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ స్లోగా సాగడం
అజయ్ దేవ్‌గణ్ రిపిటిటివ్ యాక్టింగ్
అనవసరమైన పాత్రలు
Read Also : రెట్రో మూవీ రివ్యూ : ఇదో హింసాత్మక లవ్ వార్
‘రైడ్’ సినిమా ఇష్టపడిన వారికి, ఈ సీక్వెల్ ఒక మంచి ఫాలో-అప్. అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్‌ముఖ్ తలపడే సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్‌ల కోసం ఓసారి ఈ సినిమాను చూడవచ్చు. కానీ అంచనాలతో థియేటర్లోకి వెళ్తే కష్టమే.
Raid 2 Rating : 1.5/5