Udvegam Movie Review: నవంబర్ చివరి వారంలో విడుదల కానున్న ఎన్నో సినిమాల్లో ‘ఉద్వేగం’కూడా ఒకటి. యంగ్ హీరో త్రిగుణ్ హీరోగా నటించిన ఈ మూవీ ఒక కోర్డ్ డ్రామాగా తెరకెక్కింది. నవంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ తాజాగా బయటికొచ్చింది. కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి శంకర్, ఎల్ మధు నిర్మించిన చిత్రం ‘ఉద్వేగం’. మహిపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్ లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కోర్డ్ రూమ్ డ్రామాగా ఎన్నో అంచనాలతో విడుదలయిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూసేయండి.
కథ..
మహీంద్రా (త్రిగుణ్) ఒక లాయర్. తనదైన శైలిలో క్రిమినల్ కేసులను డీల్ చేస్తుంటాడు. తనకు తన వృత్తి ఎంత ఇష్టమో.. అమ్ములు (దీప్సిక) అంటే కూడా అంతే ఇష్టం. మహీంద్రా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక గ్యాంగ్ రేప్ కేసు డీల్ చేయాల్సి వస్తుంది. మొదట కేసును టేకప్ చేయడానికి మహీంద్రా ఒప్పుకోడు. కానీ తర్వాత కేసును ఒప్పుకుంటాడు. ఆ కేసులో నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. మరోవైపు లాయర్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి వైపు నుండి ఈ కేసును వాదిస్తాడు. అసలు ఈ కేసు కారణంగా మహీంద్రా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ కేసును తను ఎలా డీల్ చేశాడు? చివరికి ఏం జరిగింది? అనేది వెండితెరపై చూడాల్సిన అసలు కథ.
Also Read: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
విశ్లేషణ..
‘ఉద్వేగం’ సినిమాలో అనేది క్రైమ్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ కూడా బాగా చూపించారు. ఈ మూవీలో హీరో.. బాధితురాలికి కాకుండా నిందితుడికి సపోర్ట్ చేస్తూ కేసు వాదించడం అనేది కొత్త పాయింట్. దాంతో ఈ సినిమా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుంది. ‘ఉద్వేగం’ ప్రారంభమయిన 20 నిమిషాల తర్వాత అసలు ఎక్కడా డౌన్ అవ్వదు. చివరివరకూ అదే స్పీడ్, థ్రిల్ మెయింటేయిన్ చేస్తుంది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్‌లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. త్రిగుణ్, దీప్సిక మధ్య లవ్ ట్రాక్ సింపుల్‌గా ఉన్నా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. మామూలుగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్. ‘ఉద్వేగం’ దర్శకుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆ లోటు ప్రేక్షకులకు పెద్దగా తెలియకుండా మ్యానేజ్ చేశారు.
నటన ఎలా ఉందంటే?
త్రిగుణ్ ఎలాంటి పాత్రలు చేసినా తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. అలాగే ‘ఉద్వేగం’లో యంగ్ లాయర్‌గా కూడా తను ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్రకు తగినట్టుగా నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో హీరో, హీరోయిన్.. ఇద్దరూ మెప్పించారు. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ రీఎంట్రీ గుర్తుండిపోతుంది. జడ్జిగా సురేష్ బాగానే నవ్వులు పంచారు. శ్రీకాంత్ అయ్యంగార్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఉద్వేగం’లో లాయర్ పాత్రలో ఆయన మరోసారి తన మార్క్ యాక్టింగ్ చూపించారు. దర్శకుడిగా మహిపాల్ రెడ్డి ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యింది. ఎడిటింగ్, కెమెరా వర్క్ బాగున్నా ఇంకా బాగుండవచ్చు అనే ఆలోచన ప్రేక్షకులకు రావచ్చు. ఆకట్టుకునే కథనం, ఊహకందని మలుపులతో కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ‘ఉద్వేగం’ కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది.
రేటింగ్: 2.25/5