BigTV English

JAGAN: జగన్ 2.0 రెడీ.. తేల్చుకోవాల్సింది ప్రజలే!

JAGAN: జగన్ 2.0 రెడీ.. తేల్చుకోవాల్సింది ప్రజలే!

JAGAN: వైసీపీ ఫ్యూచర్ ప్లానేంటి? గురువారం జగన్ మాటలతో ఓ క్లారిటీ ఇచ్చేశారా? 2029లో తాము అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ముందుగానే మీడియాకు మసాలా ఇచ్చేశారా? తాడేపల్లిలో మీడియా సమావేశం పెట్టిన ప్రతీసారీ ఈ విధంగా మసాలా ఇస్తున్నారా?  పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రతీ పనిని ఎందుకు సమర్థిస్తున్నారు? కేడర్ ఎందుకు భయపడుతోంది? ఇదే ఒరవడి కొనసాగితే ఉండడం కష్టమేనని ఎందుకు అంటున్నారు ఆ పార్టీ నేతలు?


2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని పదే పదే చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్.  అప్పుడు 2.0 ఎలా ఉంటుందో చూస్తారని చెప్పకనే చెబుతున్నారు. గురువారం మీడియా ముందు జగన్ మాట్లాడిన మాటలు చూసిన రాజకీయ నేతలు సైతం షాకయ్యారు.  అధినేత తరహాలో హుందాగా మాట్లాడాల్సింది పోయి.. కార్యకర్త మాదిరిగా ఎలా మాట్లాడుతున్నారంటూ  ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు.

ఇలాంటి వ్యక్తి ఏపీని పాలించే అర్హత ఉందా? అన్నది ప్రస్తుతం  రైజింగ్ అవుతున్న పాయింట్. రప్పా రప్పా డైలాగ్‌ని మళ్లీ మళ్లీ అడిగి చెప్పించుకునే ఆయన సైకాలజీని ఏమనాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో పుష్ప2 డైలాగ్‌ని గుర్తు చేస్తున్నారు. పుష్ప డైలాగ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుని, అందుకు జగన్ ఫోటో పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ‘‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’’ ఆ డైలాగ్ కింద జగన్ ఫోటో ఉండటాన్ని చాలామంది తప్పుబడుతున్నారు.


ఈ మధ్యకాలంలో జగన్ నాలుగు టూర్లు వేశారు. వాటిలో అనంతపుర జిల్లాలోని రాప్తాడు. ఏకంగా వైసీపీ అభిమానులు హెలికాఫ్టర్ విండోలను డ్యామేజ్ చేశారు.  ఆ తర్వాత తెనాలిలో గంజాయ్ బ్యాచ్, రౌడీ షీటర్లను పరామర్శించడం చేయడం జరిగింది. బాధిత కుటుంబాలను పక్కన పెట్టుకుని మీడియా ముందుకు రావటానికి జగన్ భయపడ్డారని అంటున్నారు. అందుకే సమావేశంలో బాధితులు కనిపించలేదని చెబుతున్నారు.

ALSO READ: రూ. 62 కోట్లతో ప్రపంచ రికార్డు లక్ష్యంగా యోగాంధ్ర

ప్రకాశం జిలా పొదలి విషయానికి వద్దాం. జగన్ టూర్ తర్వాత వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాత్రవేళ గొడ్డళ్లతో హల్‌చల్ చేశారు. రోడ్లపై ఫెక్సీలు పట్టుకుని కనిపించారు. వాటిని చూసిన ఆ జిల్లా పోలీసులు షాకయ్యారు.  పల్నాడు టూర్ విషయానికి వద్దాం. బెట్టింగ్స్ యాప్స్ ద్వారా చనిపోయిన నాగమల్లేశ్వరరావు విగ్రహం ఏర్పాటుకు మాజీ సీఎం జగన్ హాజరు కావడాన్ని ఆయన ఆలోచన విధానాన్ని  బయటపెట్టిందని చెబుతున్నారు. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆ పార్టీ నేతలు ఇలాగైతే ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమని అంటున్నారు.

ఈ నాలుగు టూర్లను పరిశీలించిన ఏపీ ప్రజలు..  బహుశా ‘2029లో వైసీపీ మేనిఫెస్టో’ ఈ విధంగా ఉంటుందేమోనని అనుకుంటున్నారు.  తాము అధికారంలోకి వస్తే ‘రప్పా రప్పా అంటూ నరుకుతామన్నది’ మొదటి పాయింట్‌గా చెబుతున్నారు. గంజాయ్ సేవించి దాడులు చేసినవారికి ఆహ్వానమన్నది సెకండ్ పాయింట్. రౌడీ షీటర్లకు ఆహ్వానించడం చూస్తుంటే వైసీపీ దిగజారిపోయిందని అంటున్నారు. పొదిలి ఘటన తర్వాత దాదాపు 25 మందిపై కేసులు నమోదు అయినట్టు సమాచారం.  పల్నాడు టూర్‌లో కీలక నేతలపై కేసులు నమోదు చేశారు.  ఇంకెంతమంది కార్యకర్తలు బుక్కవుతారో చూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×