Lopaliki ra cheptha Review : ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపేలా లేవు. శనివారం రోజున అంటే జూలై 5న ‘లోపలి రా చెప్తా’ అనే సినిమా వచ్చింది. హర్రర్ టచ్ ఉన్న కామెడీ సినిమా అని దీని గురించి ప్రచారం చేసుకున్నారు. మరి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..
కథ..
రామ్( కొండా వెంకట రాజేంద్ర) ఒక ఫుడ్ డెలివరీ బాయ్. అతనికి ఒకరోజు సిగ్నల్ వద్ద టిక్ టాక్ చేసుకునే అమ్మాయి రుక్మిణి(సాంచి రాయ్) పరిచయమవుతుంది. ఆమెతో ముద్దు ముచ్చట కోసం వెళ్లిన అతని వల్ల.. విక్కీ(విలన్) ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. దీంతో విక్కీ తన భార్య నైనికని(మనీషా జష్ణని) ఇంట్లో నుండి బయటకి గెంటేస్తాడు. విషయం తెలుసుకున్న రామ్.. ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత తెలీకుండానే ఆమెను అనుభవించాలి అనే కోరిక రామ్ లోకి కలుగుతుంది. అయితే ఆ వెంటనే విక్కీ.. వచ్చి నైనికని తీసుకువెళ్లిపోతాడు. తర్వాత నైనిక లైఫ్ ఏమైంది? అనేది ఒక కథ అయితే..! కొన్నేళ్ల తర్వాత రామ్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అవుతాడు. దీంతో అతనికి ప్రియా(సుస్మిత అనల) అనే మంచి అమ్మాయితో పెళ్లి అవుతుంది. అయితే సరిగ్గా శోభనం రోజున ప్రియాని ఓ ఆత్మ ఆవహిస్తుంది. ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? నైనిక తన భర్తతో వెళ్ళాక ఏం జరిగింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ..
జనాలు ఒకప్పటిలా లేరు. సినిమాలు చూస్తున్నప్పుడు వచ్చే ట్విస్టులు ముందుగానే గెస్ చేసేస్తున్నారు. వరల్డ్ సినిమా అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. అయినప్పటికీ హర్రర్ సినిమా అంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఏదో ఒక మాయ ఉంటే దాన్ని ఎంజాయ్ చేయాలని ఆశపడతారు. భయపెట్టే అంశాలు ఉంటే థ్రిల్ ఫీలవుతారు. అవి ఉండాలని కూడా కోరుకుంటారు. కానీ ఈ ‘లోపలి రా చెప్తా’ లో అవన్నీ సూన్యం అనే చెప్పాలి. సినిమాలో భయపెట్టే ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండదు. పైగా సిల్లీగా అనిపిస్తుంది. కామెడీ అంటారా? అది ఉన్నా నవ్వు తెప్పించదు. పైగా విసిగిస్తుంది.క్లైమాక్స్ లో డైరెక్టర్ చెప్పిన పాయింట్ కన్విన్సింగ్ గా ఉంది. కానీ దాని కోసం సినిమా ఫస్ట్ నుండి విపరీతంగా సాగదీశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంతటికీ కంప్లీట్ అవ్వదు. నిర్మాణ విలువలు అయితే చాలా అంటే చాలా చీప్ గా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ చూపదు. పాటలు మాత్రం ఒకటి, రెండు బాగానే అనిపిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే.. రాజేంద్ర డెలివరీ బాయ్ లుక్ బాగుంది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా అతను ఎందుకో సెట్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ లో అతని నటన తేలిపోయింది. హీరోయిన్స్ లో సుస్మిత, మనీషా బాగా చేశారు. సాంచి రాయ్ లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. వంశీధర్ గౌడ్ కామెడీ తేలిపోయింది.
ప్లస్ పాయింట్స్..
2 పాటలు
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్..
డైరెక్షన్
చీప్ ప్రొడక్షన్ వాల్యూస్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫైనల్ గా ‘లోపలి రా చెప్తా’ సినిమా మొదటి సీన్ నుండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. క్లైమాక్స్ అదీ చివరి 10 నిమిషాలు, పాటలు తప్ప ఇందులో ఆకట్టుకునే అంశాలు ఇక ఏమీ ఉండవు.
రేటింగ్ : 1/5