L2 Empuraan Movie Review : ఉగాది, రంజన్ పండగలని పురస్కరించుకుని ఈ వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ‘ఎల్2: ఎంపురాన్’ మూవీ ఒకటి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ‘లూసిఫర్’ కు సీక్వెల్ గా రూపొందింది. అది సూపర్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచానలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ సినిమా మ్యాచ్ చేసిందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
‘లూసిఫర్’ కథ చాలా మందికి తెలిసిందే. తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని, పార్టీని వేధిస్తున్న బిమల్ అలియాస్ బాబీ(వివేక్ ఒబెరాయ్) ను స్టీఫెన్(మోహన్ లాల్) ఎలా అంతం చేశాడు? అనేది ఆ సినిమా కథ. ఇక రెండో పార్ట్ విషయానికి వస్తే.. కేరళలో పీకేఆర్ అలియాస్ రామ్ దాస్ (సచిన్ ఖేడ్కర్) స్థాపించిన ఐ యూ ఎఫ్ పార్టీ నుండి బయటకి వెళ్లి సొంత పార్టీని పెట్టుకోవాలనుకుంటాడు జాతిన్ రామ్ దాస్(టోవినో థామస్).ఈ విషయం తెలుసుకుని అతని సోదరి ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్) షాక్ తింటుంది. దీంతో ఆమె తన తండ్రి పార్టీ ఐయూఎఫ్‌లో చేరాల్సి వస్తుంది. అయితే తర్వాత ఆమెకు షాకిస్తూ సెంట్రల్ పార్టీ ఆమెను అరెస్ట్ చేయిస్తుంది. మరోపక్క బల్రాజ్ అలియాస్ బాబా భజరంగీ కేరళ పాలిటిక్స్ లో ఎందుకు తలదూర్చాడు. అతని వల్ల పీకేఆర్ కుటుంబం ఎలాంటి సమస్యల్లో పడింది? కేరళ ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? వీటిని తీర్చడానికి స్టీఫెన్(మోహన్ లాల్) రంగంలోకి దిగాడా? లేదా? అసలు జాతిన్ రాందాస్ ఎందుకు పార్టీ నుండి బయటకి వెళ్ళాడు. స్టీఫెన్ కి సోదరుడు, బాడీగార్డ్..లా ఉండే సయీద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) లక్ష్యమేంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ:
‘ఎంపురాన్’ సినిమా ఇరాక్‌లో మొదలవుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడటానికి రిచ్ గా అనిపిస్తుంది. ఆ వెంటనే 2002 లో జరిగిన మతకలహాల ట్రాక్ ను చూపించారు. దానికి మిగతా కథకి సంబంధం ఏంటి అనే ఆలోచనతో ప్రేక్షకుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.
మోహన్ లాల్ ఎంట్రీకి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో అతని స్క్రీన్ స్పేస్ బాగా తక్కువగా ఉన్న అసంతృప్తి అభిమానులకి కలగొచ్చు. అయితే సెకండాఫ్ లో ప్రేక్షకులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ ను, హీరో ఎలివేషన్స్ ను గట్టిగానే దట్టించాడు దర్శకుడు పృథ్వీరాజ్. క్లైమాక్స్ లో ట్విస్టులు ప్రెడిక్టబుల్ గా అయితే ఉండవు.. అలా అని ఆసక్తి కలిగించేలా కూడా ఉండవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్ పై కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా సినిమా రిచ్ గానే అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా చెప్పుకున్నట్టు మోహన్ లాల్ స్క్రీన్ స్పేస్ తక్కువైన ఫీలింగ్ అందరికీ కలుగుతుంది.అంతేకాదు మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో అతను చేసింది ఏంటి అనే డౌట్ వచ్చినప్పుడు.. పక్కనున్న పాత్రలతో హైలెట్ చేస్తూ పుష్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో మోహన్ లాల్ చాలా కష్టపడ్డాడు. ఈ వయసులో అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం అభినందనీయం. టోవినో థామస్ రోల్ ఇందులో కూడా కీలకంగా ఉంటుంది. మంజు వారియర్ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. ఇందులో పెద్దగా చేసింది ఏమీ లేదు. ఫస్ట్ పార్ట్ లో స్ట్రాంగ్ విమెన్ గా కనిపించిన ఈమె.. సెకండ్ పార్ట్..లో నిస్సహాయ స్థితిలో ఉన్నట్టే ఉంటుంది. ఇక ఇందులో కీలక పాత్ర చేసిన పృథ్వీ రాజ్ కూడా తనకి తాను మంచి ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. ఇంకా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నా… అవి రిజిస్టర్ కావు అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్
యాక్షన్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్ :
సాగదీత
లెక్కలేనన్ని పాత్రలు
కన్ఫ్యుజింగ్ స్క్రీన్ ప్లే
మొత్తంగా ‘ఎంపురాన్’ … అంచనాలు అందుకోవడంలో తడబడింది. ‘లూసిఫర్’ రేంజ్లో ఇది మెప్పించలేదు. కొంత పార్ట్ ట్రిమ్ చేస్తే చాలా బెటర్.
L2 Empuraan Telugu Movie Rating – 2 / 5