రివ్యూ : సార్ మేడమ్ (Thalaivan Thalaivii in Tamil)
విడుదల తేదీ: జులై 25, 2025 (తమిళం); ఆగస్టు 1, 2025 (తెలుగు)
నటీనటులు : విజయ్ సేతుపతి, నిత్యా మీనన్, యోగి బాబు ఇతరులు
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు : సెంధిల్ త్యాగరాజన్ & అర్జున్ త్యాగరాజన్
బ్యానర్ : సత్య జ్యోతి ఫిల్మ్స్
మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్
Sir Madam Review : విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తలైవన్ తలైవి’ తెలుగులో ‘సార్ మేడమ్’ అనే టైటిల్ తో ఈరోజు విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అగసవీరన్ (విజయ్ సేతుపతి) తన కుటుంబంతో కలిసి ఒక టిఫిన్ సెంటర్ నడుపుతాడు. పెరారసి (నిత్య మీనన్) అని పిలుచుకునే అరసిని పెళ్లి చేసుకుంటాడు. కొత్తగా పెళ్ళైన జంట మధ్య వైవాహిక జీవితం మొదట్లో సజావుగా సాగుతుంది. కానీ అతి త్వరగానే ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. వంట, ఇంటి పనులు, అలవాట్లు. ఈ గొడవలు పెద్దవై, డివోర్స్ వరకు వెళతాయి. ఆ తరువాత జరిగే ఓ సంఘటనతో మూవీ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక దంపతుల మధ్య జరిగే వ్యక్తిగత సంఘర్షణ కుటుంబ సమస్యగా మారుతుంది. అసలు హీరోహీరోయిన్ మధ్య గొడవకు కారణం ఏమిటి? అసలు ట్విస్ట్ ఏమిటి? వాళ్ళు చివరికి రాజీపడతారా లేదా విడాకులు తీసుకుంటారా ? అనేది మూవీ స్టోరీ.
విశ్లేషణ
దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమా ద్వారా నిజ జీవితంలో రిలేషన్షిప్ లోని సమస్యలను తెరపై సహజంగా చూపించాలని అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న పాయింట్ ను తెరపై ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యారు. రొటీన్ స్టోరీ కావడంతో బెడిసికొట్టింది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. మూవీ ఫస్టాఫ్ లో యోగి బాబు, హీరోహీరోయిన్ల గొడవల సన్నివేశాలు నవ్విస్తాయి. కానీ రానురానూ అవే సీన్లు చిరాకు పుట్టిస్తాయి. గ్రామీణ నేపథ్యం, టిఫిన్ సెంటర్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ నీరసంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ఓ సీన్ హైలెట్ గా ఉంటుంది.
విజయ్ సేతుపతి సహజమైన నటన, కామెడీ టైమింగ్ అద్భుతం. నిత్యా మీనన్ తన పాత్రలో అదరగొట్టింది. వీళ్ళ కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం. సంతోష్ నారాయణన్ సంగీతం ఫీల్-గుడ్ మూడ్‌ను ఇస్తుంది. ఇక రన్ టైం 2 గంటల 46 నిమిషాలు ఉండడంతో మూవీని సాగదీసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కట్ చేస్తే బాగుండేది. తెలుగు వెర్షన్ డబ్బింగ్ నిరాశ పరుస్తుంది. నిర్మాణ విలువలు స్టాండర్డ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటన
సంగీతం
మైనస్ పాయింట్స్
వీక్ స్క్రీన్‌ప్లే
రన్ టైం
తెలుగు డబ్బింగ్
మొత్తానికి
నిత్యా మీనన్, విజయ్ సేతుపతి కోసం ఓసారి చూడదగ్గ మూవీ.
Sir Madam Rating : 2.5/5