Oka Brundavanam Movie Review : ఇటీవల థియేటర్లలో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలకి జనాలు నీరాజనం పలుకుతున్నారు. కంటెంట్ బాగుందంటే ఆ సినిమాని చూడడానికి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ప్రతి ఒక్కటి కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. హనుమాన్ లాంటి సినిమాలు ఈమధ్య ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలాంటి ఒక చిన్న సినిమానే ‘ఒక బృందావనం’..
బాలు, షిన్నోవా, సాన్విత కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశి నెక్కంటి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సీర్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మాణంలో సత్య బొత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ మే 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో..? ఈ మూవీ రివ్యూ లో తెలుసుకుందాం..
కథ విషయానికొస్తే..
రాజా విక్రమ్ అనే యువకుడు కెమెరామెన్ గా ఓ ఈవెంట్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఇంట్లో అన్ని కష్టాలే. ఎప్పటికైనా అమెరికాకు వెళ్లాలని అతని కోరిక.. అక్కడకు వెళ్లి మంచి ఉద్యోగం చేసుకొని బాగా సంపాందించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అటు హీరోయిన్ మహి చనిపోయిన వాళ్ళ అమ్మ మీద డాక్యుమెంటరీ చేయాలని ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక అనాధశ్రమంలో చేరుతుంది. ఆ పాపకు జోసెఫ్ అనే వ్యక్తి ప్రతి ఏడాది క్రిస్మస్కు ఒక గిఫ్ట్ ని పంపిస్తాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసుకోవాలని మహి అనుకుంటుంది. రాజా గర్ల్ ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకోవడంతో లవ్ బ్రేకప్ లో ఉన్నప్పుడు రాజా కెమెరా స్కిల్స్ నచ్చాయని మహి తన డాక్యుమెంటరీ కెమెరామెన్ గా చేయమని అడుగుతుంది. రాజ్ అవసరాలకు డబ్బు కావాలని ఓకే చెప్తాడు. అలా రాజ్ – మహి ఓ డాక్యుమెంటరీ కోసం కలిసి తిరుగుతారు. ఈ క్రమంలో నైనికను కలుసుకుంటాడు. ఇద్దరి మధ్య సాన్నిత్యం ఏర్పడుతుంది.
నైనిక జోసెఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆశ్రమం నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. తనని జోసెఫ్ వద్దకు తీసుకువెళ్తామని చెప్పడంతో నైనిక డాక్యుమెంటరీ వీడియోకి ఒప్పుకుంటుంది. అసలు మహి డాక్యుమెంటరీ దేని గురించి? రాజ్ అమెరికాకు వెళ్లాడా? జోసెఫ్ ఎవరు? పాపకు ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు?మహి పెళ్లి జరుగుతుందా?జోసెఫ్ కోసం రాజ్, మహి, నైనిక చేసే ప్రయాణం ఎలా ఉంటుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ..
అప్పుడప్పుడు మంచి స్టోరీ ఉన్న సినిమాలు, హృదయానికి హత్తుకునే సినిమాలు కొన్ని వస్తాయి. ఈ ఒక బృందావనం సినిమా కూడా ఆ కోవలోకి చెందిందే. ఫస్ట్ హాఫ్ అంతా రాజా, మహి, నైనిక పాత్రల పరిచయం, రాజా బ్రేకప్ స్టోరీ, మహి రాజా వెనక డాక్యుమెంటరీ కోసం తిరగడం, డాక్యుమెంటరీ షూటింగ్ తో కాస్త నిదానంగా సాగుతుంది. ఒక మంచి ఎమోషన్ తో సెకండ్ అఫ్ ఇస్తారు. జోసెఫ్ ని వెతుక్కుంటూ రాజా, మహి, నైనిక ప్రయాణం ఎలా సాగింది, నైనిక ఎవరు.. అంటూ మంచి ఫీల్ తో సాగుతుంది. ఒకరికి ఒకరు ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనేది ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది.
ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. వెళ్లి బాగా సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటాడు. మహి(షిన్నోవా) చనిపోయిన వాళ్ళ అమ్మ చేయాలనుకున్న డాక్యుమెంటరీ చేయాలని, ఇంట్లో పెళ్లి వద్దని చెప్పి బయటకు వచ్చేస్తుంది. నైనికా(సాన్విత) అనాథాశ్రమంలో ఉంటుంది. ఆ పాపకు ప్రతి సంవత్సరం జోసెఫ్(శుభలేఖ సుధాకర్) పేరు మీద క్రిస్మస్ కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఎప్పటికైనా జోసెఫ్ ని కలవాలని, తన పేరెంట్స్ ఎవరో కనుక్కోవాలని అనుకుంటుంది.
రాజా గర్ల్ ఫ్రెండ్ వేరే పెళ్లి చేసుకోవడంతో లవ్ బ్రేకప్ లో ఉన్నప్పుడు రాజా కెమెరా స్కిల్స్ నచ్చాయని మహి తన డాక్యుమెంటరీ కెమెరామెన్ గా చేయమని అడుగుతుంది. రాజ్ అవసరాలకు డబ్బు కావాలని ఓకే చెప్తాడు. అలా రాజ్ – మహి ఓ డాక్యుమెంటరీ కోసం కలిసి తిరుగుతారు. ఈ క్రమంలో నైనిక ని కలుస్తారు. నైనిక జోసెఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆశ్రమం నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. తనని జోసెఫ్ వద్దకు తీసుకువెళ్తామని చెప్పడంతో నైనిక డాక్యుమెంటరీ వీడియోకి ఒప్పుకుంటుంది. అసలు మహి డాక్యుమెంటరీ దేని గురించి? రాజ్ అమెరికాకు వెళ్లాడా? జోసెఫ్ ఎవరు? పాపకు ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు?మహి పెళ్లి జరుగుతుందా? జోసెఫ్ కోసం రాజ్, మహి, నైనిక చేసే ప్రయాణం ఎలా ఉంటుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. అక్కడక్కడా కంటతడి పెట్టిస్తారు, అక్కడక్కడా నవ్విస్తారు కూడా. ఇప్పుడొస్తున్న యాక్షన్, థ్రిల్లర్, లౌడ్ మ్యూజిక్ సినిమాల మధ్య సింపుల్ కథ, కథనం, సింపుల్ మ్యూజిక్ తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. కాకపోతే స్లో నేరేషన్ కావడంతో చూడటానికి కాస్త ఓపిక ఉండాలి. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు..
నటీనటుల విశానికొస్తే.. ఈ మూవీలో బాలు కెమెరామెన్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. షిన్నోవా ఒక పరిణితి చెందిన యువతి పాత్రలో మెప్పిస్తుంది. షిన్నోవాని చూస్తుంటే కేరింత సినిమాలో నటి సుకృతి గుర్తుకు రావడం ఖాయం. చైల్డ్ ఆసినిమాఅక్కడక్కడా కంటతడి పెట్టిస్తారు, అక్కడక్కడా నవ్విస్తారు కూడా. ఇప్పుడొస్తున్న యాక్షన్, థ్రిల్లర్, లౌడ్ మ్యూజిక్ సినిమాల మధ్య సింపుల్ కథ, కథనం, సింపుల్ మ్యూజిక్ తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. కాకపోతే స్లో నేరేషన్ కావడంతో చూడటానికి కాస్త ఓపిక ఉండాలి. ఫ్యార్టిస్ట్ సాన్విత కూడా క్యూట్ గా అలరిస్తుంది. మహేందర్, మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్విస్తారు. శుభలేఖ సుధాకర్ ఫాదర్ పాత్రలో చక్కగా నటించారు. వంశి నెక్కంటి హీరోయిన్ తండ్రి పాత్రలో సింపుల్ గా కనిపించి మెప్పిస్తారు. రూపాలక్ష్మి, శివాజీరాజా.. మిగిలిన నటీనటులు తమ పాత్రలు చేస్తారు..టెక్నీకల్ పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కొంతభాగం కేరళలో షూట్ చేయడంతో అందమైన లొకేషన్స్ ని చూపించారు. మ్యూజిక్ కూడా సింపుల్ గా కథకు తగ్గట్టు బాగుంది. పాటలు కూడా మెప్పిస్తాయి. కథ పాతదే అనిపించినా కాస్త కొత్త కథాంశంతో మంచి డైలాగ్స్ తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ లో ఇంకాస్త కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టి మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.
మొత్తానికి చివరగా.. ఒక బృందావనం సినిమా టైటిల్ కి తగట్టు మనసుకు హాయినిస్తూ మంచి ఎమోషన్ తో మెప్పించే సినిమా. కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉందో చూడాలి..
రేటింగ్ : 2.5 /5