మూవీ : ప్రేమిస్తావా (Premistava)
రిలీజ్ డేట్ : 31 జనవరి 2025
దర్శకుడు : విష్ణు వర్ధన్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవిశంకర్
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
నటీనటుల : ఆకాష్ మురళి, అదితి శంకర్, ఖుష్బూ సుందర్, శరత్ కుమార్ తదితరులు
Premistava Movie Rating : 1.75/5
తమిళ స్టార్ దర్శకుడు విషువర్దన్ అజిత్ తో ‘బిల్లా’, ‘ఆట ఆరంభం’ వంటి సినిమాలు తీసి మెప్పించాడు. మధ్యలో తెలుగులో పవన్ కళ్యాణ్ ని ఇంప్రెస్ చేసి ‘పంజా’ అనే స్టైలిష్ యాక్షన్ మూవీ కూడా తీశాడు. ఆ తర్వాత ఎందుకో ఇతను సైలెంట్ అయిపోయాడు. సినిమాలు కూడా తగ్గించాడు. కొంత గ్యాప్ తర్వాత.. అథర్వ మురళి తమ్ముడు ఆకాష్ మురళి, దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్..లని హీరో, హీరోయిన్లుగా పెట్టి ‘ప్రేమిస్తావా’ అనే సినిమా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ :
అర్జున్ (ఆకాశ్ మురళి) తన కాలేజీ అమ్మాయి దియా (అదితి శంకర్) ని ప్రేమిస్తాడు. మొదట ఆమె ఒప్పుకోదు కానీ తర్వాత ఆమె పాస్ట్ గురించి చెప్పి.. అతన్ని ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్లో ఉంటారు. ఆ టైంలో మళ్ళీ వీళ్ళ మధ్య మనస్పర్థలు వస్తాయి. దీంతో అర్జున్ ని వదిలేసి.. దియా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. తర్వాత అర్జున్ ఆ వార్త తెలుసుకుని ఆమెని కలవడానికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? అర్జున్.. దియాని కలిశాడా? ఆమె హత్య కేసు నుండి బయటపారేశాడా? అసలు హత్య చేయబడిన వ్యక్తి ఎవరు? వంటి ప్రశ్నలకి సమాధానమే ‘ప్రేమిస్తావా’ మిగతా భాగం.
విశ్లేషణ :
ఓ సాధారణ ప్రేమ కథకి క్రైమ్ టచ్ ఇవ్వడం అనేది కొత్త పాయింట్ ఏమీ కాదు. ఇది చాలా సినిమాల్లో చూశాం. మణిరత్నం ‘రోజా’ నుండి పూరీ జగన్నాథ్ ‘143’ వరకు.. ఇక మొన్నామధ్య వచ్చిన ‘సీతారామం’ వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. సో తమిళ ప్రేక్షకులకి ఏమో కానీ తెలుగు ప్రేక్షకులకి ‘ప్రేమిస్తావా’ అనేది కొత్త ఫీలింగ్ ను కలిగించదు. సినిమాకి సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకుండానే క్లైమాక్స్ వరకు లాగించేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు బాగున్నాయి. కానీ కథ ఏంటో తెలీకుండా కథనంతో సింక్ అవ్వడం కష్టం. అందుకే బాగున్న సీన్లు కూడా.. బాగున్నాయి అని తర్వాత ఎప్పుడో చెప్పుకోవడానికి తప్ప.. ఆ టైంలో ఎంజాయ్ చేసే విధంగా ఉండవు.
సెకండాఫ్, ప్రీ క్లైమాక్స్ బ్లాక్ ఏదో టర్న్ తీసుకుంటుందేమో అనే ఆశ పుట్టిస్తుంది. కానీ తర్వాత అది కూడా పేలవంగానే సాగుతుంది. సరిగ్గా ప్రేక్షకుడు సినిమా కథని అర్ధం చేసుకునే సరికి సినిమా అయిపోతుంది అనడంలో సందేహం లేదు. దర్శకుడు విష్ణువర్ధన్ సినిమాని స్టైలిష్ గా తీస్తాడు అనేది నిజం. ఇప్పటికీ ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ అతని సినిమాల్లో కొన్ని కథల పరంగా బాగున్నప్పటికీ కథనం మెప్పించదు. ఈ ‘ప్రేమిస్తావా’ కూడా ఆ కేటగిరిలోకి చేరిపోతుంది అనడంలో సందేహం లేవు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ఎరిక్ బ్రైసన్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. అధితి శంకర్ కి నటనకి స్కోప్ ఉన్న రోల్ దొరికింది. దియా పాత్రలో ఆమె లుక్స్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. కానీ ఆమె పాత్రని హైలెట్ చేయడానికి హీరో పాత్రని తగ్గించాలని చూసినట్టు ఉన్నారు. అందుకే ఆకాష్ మురళి పాత్ర అంతగా హైలెట్ అవ్వలేదు. కానీ తన వరకు పూర్తి న్యాయం చేశాడు. తన నెక్స్ట్ సినిమాలకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. శరత్ కుమార్,ఖుష్బూలకి కూడా మంచి పాత్రలే దొరికాయి. కల్కి కూడా ఓకే అనిపించేలా చేసింది. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు.
ప్లస్ పాయింట్స్ :
స్టోరీ లైన్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
ల్యాగ్ ఎక్కువగా ఉండటం
మొత్తంగా.. ‘ప్రేమిస్తావా? యూత్ ని టార్గెట్ చేసి తీసినప్పటికీ.. వాళ్లకి కూడా బోర్ కొట్టించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి నిలబడటం కష్టమే.
Premistava Movie Rating : 1.75/5