BigTV English

Rana Naidu Season 2 Review : ‘రానా నాయుడు 2’ రివ్యూ… వెంకీ మామ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా

Rana Naidu Season 2 Review : ‘రానా నాయుడు 2’ రివ్యూ… వెంకీ మామ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా

రివ్యూ : ‘రానా నాయుడు సీజన్ 2’ సిరీస్


విడుదల తేదీ : జూన్ 13
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
దర్శకులు : కరణ్ అన్షుమన్, సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా
నటీనటులు: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుషాంత్ సింగ్, కృతి ఖర్బంద, రజత్ కపూర్ తదితరులు
ఎపిసోడ్‌లు : 8 (ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాలు)

Rana Naidu Season 2 Review : దగ్గుబాటి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రానా నాయుడు’ సీజన్ 2 ఎట్టకేలకు ఈరోజే ఓటీటీలోకి అడుగు పెట్టింది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. అమెరికన్ సిరీస్ రే డోనవన్‌కి రీమేక్‌గా వచ్చిన ఫ‌స్ట్ సీజ‌న్ లో వాడిన అసభ్యకర పదజాలం వల్ల గట్టిగానే విమర్శలు మూటగట్టుకున్నారు. మరి దీనికి కొన‌సాగింపుగా వచ్చిన రెండో సీజ‌న్‌ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
మొదటి సీజన్ లో… బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల ఏకైక వ్యక్తి రానా నాయుడు (రానా). భార్య, ఇద్దరు పిల్లలతో అతనిది హ్యాపీ లైఫ్‌. సరిగ్గా అదే సమయంలో రానాకు అస్సలు పడని అతని తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) జైలు నుంచి బయటకు వస్తాడు. నాగా నాయుడికి మరో ఇద్దరు కొడుకులు తేజ్‌ నాయుడు (సుశాంత్‌ సింగ్‌), జఫ్ఫానాయుడు (అభిషేక్‌ బెనర్జీ) ఉంటారు. కుటుంబ సమస్యలతో రానా సతమతం అవుతాడు.

సీజన్ 2లో… రానా తన కుటుంబ భవిష్యత్తును కాపాడేందుకు చివరి సారిగా ఒక రిస్కీ ఆపరేషన్ చేయాలనుకుంటాడు. కానీ కొత్త శత్రువు రావూఫ్ మీర్జా (అర్జున్ రాంపాల్) పాత గొడవలను తిరిగి తెస్తాడు. నాగ, రానా… సోదరులు తేజ్ (సుషాంత్ సింగ్), జఫ్ఫా (అభిషేక్ బెనర్జీ), రానా భార్య నైనా (సుర్వీన్ చావ్లా), పిల్లలు నిత్య (ఆఫ్రా సయీద్), అని (మాధవ్ ధింగ్రా) మధ్య సంఘర్షణలు మరింత తీవ్రమవుతాయి. రానా కొడుకు కిడ్నాప్ తో స్టోరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలోనే రానా, నాగ ఇద్దరూ ఒక్కటై అనీని రక్షించడానికి రంగంలోకి దిగుతారు. కొడుకు సురక్షితంగా దొరకగానే నాగను ఫ్యామిలీ నుంచి తప్పుకోవాలని రానా వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు తన శత్రువు సైఫ్ ను రానా అంతమొందిస్తాడు. కానీ జైల్లో ఉన్న సైఫ్ సోదరుడు రావూఫ్ రానాపై పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. ఈ క్రమంలోనే రానా, రాజత్ కపూర్ తో కలిసి ఒక చివరి మిషన్ లో పాల్గొనాలని డిసైడ్ అవుతాడు. ఆ చివరి మిషన్ ఏంటి? అనీని రానా, నాగా కలిసి ఎలా కాపాడారు ? చివరికి నాయుడు ఫ్యామిలీ అంతా ఒక్కటయిందా? లేదా? రానాకు నా అనుకున్న వాళ్ళే ఇచ్చే దిమ్మతిరిగే షాక్ ఏంటి? రావూఫ్ పగ తీర్చుకున్నాడా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ
సీజన్ 1లో అశ్లీల భాష, అతిగా హింసపై తెలుగు ప్రేక్షకుల నుండి వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని… సీజన్ 2లో అలాంటి సన్నివేశాలు, అనవసర హింస తగ్గించారు. వెంకటేష్ పాత్రకు సంబంధించి అఫెన్సివ్ కంటెంట్‌ను కంట్రోల్ చేశారు. కానీ సీజన్ 1లో ఉన్న రా, ఎడ్జీ టోన్‌ను సీజన్ 2లో తగ్గించడం వల్ల సిరీస్ ఒరిజినల్ పంచ్‌ను కోల్పోయింది. సాధారణ యాక్షన్-థ్రిల్లర్‌లా మారిపోయిందని చెప్పాలి. అలాగే నాగ వన్-లైనర్స్ తగ్గడం కూడా డిసప్పాయింట్ చేసింది. కథలో స్థిరత్వం లేదు. ట్విస్ట్‌లు, ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్రికెట్, సినిమా, రాజకీయాల నేపథ్యాన్ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. రానా-నైనా రిలేషన్‌షిప్, జఫ్ఫా లవ్ స్టోరీ సున్నితంగా చూపించినప్పటికీ, అవి సిరీస్‌కు బలం చేకూర్చలేదు.

రానా-నాగ మధ్య తండ్రి-కొడుకు సంఘర్షణ, జఫ్ఫా – తేజ్ పాత్రల ఎమోషనల్ సీన్స్ కథకు మంచి డెప్త్ జోడించాయి. తేజ్ – అన్నా ప్రేమ కథ హార్ట్ టచింగ్ గా ఉంది. నాయుడు కుటుంబంలోని గ్రే షేడ్స్ రియలిస్టిక్‌గా అన్పిస్తాయి. అయితే
8 ఎపిసోడ్‌ లలోని సీన్స్ కొంత డ్రాగ్ అనిపించాయి. ఎడిటింగ్ మరింత టైట్‌గా ఉంటే, ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది.

వెంకటేష్ దగ్గుబాటి నాగ నాయుడుగా మరోసారి ఆకట్టుకున్నాడు. సీజన్ 1లో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని, ఈ సీజన్‌లో ఆయన పాత్రను మరింత రిఫైన్డ్‌గా, డెప్త్‌తో ఉండేలా చూసుకున్నారు. ఆయన హైదరాబాదీ యాస “వెంకీ ఆసన” సన్నివేశం తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్. రానా దగ్గుబాటి తన పాత్రను సమర్థవంతంగా పోషించినప్పటికీ, సీజన్ మొత్తం ఒకే ఎక్స్‌ప్రెషన్ ఉండడం బోర్ కొడుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కనెక్షన్ లోపించింది.

సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బంద, ఆఫ్రా సయీద్, ఆదితి శెట్టి వంటి లేడీస్ పాత్రలకు సీజన్ 2లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ప్లస్ పాయింట్. అర్జున్ రాంపాల్ రావూఫ్ మీర్జా అనే విలన్‌గా మెప్పించాడు. క్రికెట్ బ్యాట్‌తో హింస సన్నివేశాలు ఆయన పాత్రకు బలం చేకూర్చాయి. అభిషేక్ బెనర్జీ (జఫ్ఫా) ఈ సీజన్‌లో షో-స్టీలర్. జఫ్ఫా-తస్నీమ్ సీన్స్ బాగున్నాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ముంబై అండర్‌ వరల్డ్‌ను డార్క్ టోన్స్‌తో అద్భుతంగా చూపించింది. జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.

పాజిటివ్స్
నటీనటులు
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

నెగెటివ్ పాయింట్స్
కథ
ఎపిసోడ్స్ లెంగ్త్
ఎడిటింగ్
రానా పాత్ర

చివరగా
పక్కా దగ్గుబాటి అభిమానులకు ఈ సీజన్ మంచి ట్రీట్. కానీ క్యారెక్టర్ లు బాగున్నా కథ దెబ్బేసింది భయ్యా. మిగతా వాళ్ళకు రెగ్యులర్ యాక్షన్-థ్రిల్లర్‌ ఫీలింగ్ తో నిరాశ కలిగిస్తుంది.

Rana Naidu Season 2 Rating : 2/5

Related News

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Big Stories

×