మనుషులు మద్యం తాగడం కామన్. పండుగలు, పబ్బాలు, బర్త్ డే పార్టీలు, వీకెండ్ ఔటింగ్ లు చివరకు చావులు, దినాలకు కూడా ఫుల్ గా మందు తాగాల్సిందే. ఎంజాయ్ చేయాల్సిందే! ఇప్పటి వరకు మద్యం తాగే అలవాటు కేవలం మనుషులకే ఉందని అందరూ భావిస్తారు. కానీ, జంతువులు కూడా కలిసి మందు తాగుతాయంటున్నారు. పరిశోధకులు. అంతేకాదు, మందు లేకపోతే అస్సలు ఉండలేని జంతువులు కూడా ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఆ జంతువులు ఏవి? మద్యం ఎలా తాగుతాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జంతువులు కూడా మద్యం తాగుతాయనే విషయాన్ని తాజాగా కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, ఎక్కువ మద్యం తాగే జంతువులు చింపాంజీలు అని తేల్చారు. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్, ఐవరీ కోస్ట్ లోని తై నేషనల్ పార్క్ లోని చింపాజీలపై యూనివర్సిటీ జువాలజీ పరిశోధకులు కీలక స్టడీ చేశారు. ఇందులో ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. చింపాంజీలు రోజూ మద్యం తీసుకుంటున్నట్లు తేలింది. ఇంతకీ వాటికి మద్యం ఎలా వస్తుందో గుర్తించే పనిలో పడ్డారు. చివరకు తేలిన విషయం ఏంటంటే.. చింపాంజీలు సాధారణంగా బాగా పండిన పండ్లు తింటాయి. ఈ పండ్లలో సహజంగానే ఇథనాల్ ఉంటుంది. రోజూ అవి సుమారు 14 గ్రాముల వరకు ఇథనాల్(ఆల్కహాల్) తీసుకుంటున్నాయట. అంటే రోజూ రెండు కాక్ టెయిల్ లో ఉండే ఆల్కహాల్ తో సమానం అంటున్నారు పరిశోధకులు. అయితే, చింపాంజీలపై ఆల్కహాల్ ప్రభావం అంతగా కనిపించదని గుర్తించారు. దానికి కారణం అవి పండ్లను గ్యాప్ ఇచ్చి తింటున్నాయి. అంతేకాదు, చింపాంజీలు తమ దగ్గర ఉన్న పండ్లను ఇతర చింపాంజీలతో పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Read Also: ఈ రెస్టారెంట్ లో ఎటు చూసినా కండోమ్సే, ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్లొచ్చు!
అటు పండ్లు తినే సమయంలో చింపాంజీలు చాలా యాక్టివ్ గా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే, మద్యం కారణంగా చింపాంజీలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టరేట్ విద్యార్థి అలెక్సీ. పండ్లు ఎక్కువగా తిన్నప్పుడు బాగా ఉల్లాసంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక కాలిఫోర్నియా పరిశోధకులు తాజా అధ్యయనం ప్రసిద్ధ ‘డ్రంకెన్ మంకీ సిద్ధాంతం’తో లింకై ఉన్నట్లు వెల్లడించారు. మద్యం పట్ల మనుషుల ఆకర్షణకు గల మూలాలు.. కోతిగా ఉన్నప్పుడు నుంచే ఉన్నట్లు వెల్లడయ్యింది. అచ్చం మనుషుల్లో ఉన్న మాదిరిగానే చింపాజీల్లోనూ మద్యాన్ని జీర్ణం చేసే వ్యవస్థ ఉన్నట్లు చెప్పారు. చింపాజీల నుంచి సేకరించిన మూత్రం ఆధారంగా ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. చింపాజీలు తమ దగ్గర ఉన్న పండ్లను తోటి చింపాంజీలకు ఇవ్వడం చూస్తే, వాటిలో స్నేహ భావం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే మనుషులలో మాదిరిగా మద్యం సేవించే గుణాన్ని కలిగి ఉన్నట్లు చెప్తున్నారు పరిశోధకులు.
Read Also: టేస్ట్ బాగుందని.. భర్త అస్థికలను తినేసిన భార్య.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే వణికిపోతారు!