E-Paper
Advertisement

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!

పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!
Advertisement

Old iPhone Speed Up: కొత్త ఐఫోన్లు, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లు మార్కెట్‌లోకి వస్తున్నప్పుడు పాత ఐఫోన్ వాడుతున్న వారికి చిన్న ఆందోళన మొదలవుతుంది. ఫోన్ రోజురోజుకూ కాస్త స్లో అవ్వడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం లేదా యాప్స్ సరిగ్గా ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికోసం వెంటనే కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. పాత ఐఫోన్‌లోనే ఉన్న కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్‌ మార్చడం ద్వారా ఫోన్ పెర్ఫార్మెన్స్‌ను మళ్లీ పెంచుకోవచ్చు. పాత ఐఫోన్లను చాలా స్మూత్‌గా, వేగంగా పనిచేసేలా చేయడానికి మార్చాల్సిన ఐదు ముఖ్యమైన సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

యానిమేషన్లు తగ్గించడం:

ఫోన్ వాడుతున్నప్పుడు యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం వెనుక కొన్ని గ్రాఫిక్ యానిమేషన్లు ఉంటాయి. ఇవి చూడటానికి బాగున్నా, పాత ప్రాసెసర్లపై చాలా భారం మోపుతాయి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆక్సెసిబిలిటీ ఆప్షన్‌లో ‘రిడ్యూస్ మోషన్’, ‘రిడ్యూస్ ట్రాన్స్‌పారెన్సీ’ ఆన్ చేయండి. దీనివల్ల స్క్రీన్ విజువల్ ఎఫెక్ట్స్ తగ్గి, ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది. అంతేకాకుండా.. ప్రాసెసర్‌పై ఒత్తిడి తగ్గి బ్యాటరీ కూడా ఆదా అవుతుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఆపడం:

Advertisement

మనకు తెలియకుండానే వెనుక చాలా యాప్స్ రన్ అవుతుంటాయి. పాత ఐఫోన్లలో ర్యామ్ తక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ ఫోన్‌ను స్లో చేస్తాయి. అందుకే సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌కి వెళ్లి ‘బ్యాక్‌గ్రౌండ్ యాప్ రీఫ్రెష్’ను అవసరం లేని యాప్స్‌కి డిసేబుల్ చేయండి. వాట్సప్, మెయిల్ వంటి ముఖ్యమైన వాటికి మాత్రమే ఉంచి, మిగిలిన వాటికి ఆఫ్ చేయడం వల్ల ఫోన్ స్పీడ్ పెరగడమే కాకుండా ఛార్జింగ్ చాలా సేపు వస్తుంది.

Also Read: సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

లొకేషన్ ట్రాకింగ్ వద్దు:

Advertisement

ఐఫోన్‌లో ‘సిగ్నిఫికెంట్ లొకేషన్స్’ అనే ఫీచర్ మనం ఎక్కడికి వెళ్తున్నామో నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం పనిచేయడం వల్ల బ్యాటరీ వేగంగా డ్రైన్ అవుతుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లి లొకేషన్ సర్వీసెస్ ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకోండి. దీనివల్ల ప్రైవసీ పెరగడమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా మెరుగవుతుంది.

ఎయిర్‌డ్రాప్ ప్రైవసీ మార్చడం:

ఎయిర్‌డ్రాప్‌ను ఎప్పుడూ ‘ఎవ్రీవన్’లో ఉంచడం వల్ల అనవసరమైన నోటిఫికేషన్లు, స్పామ్ ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల సెక్యూరిటీ సమస్యలు కూడా రావచ్చు. అందుకే సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌కి వెళ్లి ఎయిర్‌డ్రాప్‌ను ‘కాంటాక్ట్స్ ఓన్లీ’కి మార్చుకోండి. ఇది మీకు తెలియని వ్యక్తుల నుండి వచ్చే అనవసర డేటాను అడ్డుకుని మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుతుంది.

టచ్ రెస్పాన్స్ సర్దుబాటు:

కాలక్రమేణా డిస్‌ప్లే స్పర్శ సరిగ్గా పనిచేయనట్లు అనిపిస్తే ‘హాప్టిక్ టచ్’ డ్యూరేషన్‌ను మార్చుకోవచ్చు. ఆక్సెసిబిలిటీలోని టచ్ సెట్టింగ్స్‌కి వెళ్లి ఈ సమయాన్ని ‘ఫాస్ట్’ లేదా ‘స్లో’కి అడ్జస్ట్ చేయండి. ఫోన్ టచ్ వేగంగా రెస్పాండ్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఈ చిన్న మార్పులతో మీ పాత ఐఫోన్ పెర్ఫార్మెన్స్ మెరుగై, రోజువారీ వాడకంలో చాలా వేగంగా పనిచేస్తుంది.

Also Read: MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

Tags

Related News

ఇదే సరైన టైమ్.. iPhone 17పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్, ఆఫర్ వివరాలివే!

ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

సర్కిల్ మధ్యలో గీత.. శాంసంగ్ ఫోన్‌లో ఈ సింబల్ ఎందుకు వస్తుందో తెలుసా?

MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!

బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లపై..భారీ డిస్కౌంట్లు! వెంటనే కొనేయండి

మ్యూజిక్ లవర్స్‌ని ఫిదా చేసేలా..నథింగ్ కొత్త గాడ్జెట్, మీరూ ఓ లుక్కేయండి

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

Big Stories

Advertisement
×