E-Paper
Advertisement

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Suzuki Hayabusa Special Edition: సుజుకి హయబుసా పేరు వినగానే స్పీడ్, పవర్, ప్రీమియం లుక్ గుర్తొస్తాయి. దేశంలో సూపర్‌ బైక్ ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బైక్‌కు ఇప్పుడు మరో కొత్త వెర్షన్ వచ్చింది. సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా తాజాగా హయబుసా స్పెషల్ ఎడిషన్‌ను రూ.19.90 లక్షల ధరతో విడుదల చేసింది. ఇదే సమయంలో సాధారణ హయబుసాను కూడా కొత్త రంగులు, కొన్ని ఎలక్ట్రానిక్ అప్‌ డేట్స్‌ తో రిఫ్రెష్ చేసింది.

స్పెషల్ ఎడిషన్ ధర ఎంత?

హయబుసా స్పెషల్ ఎడిషన్ ధర రూ.19.90 లక్షలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాండర్డ్ హయబుసా ధర రూ.18.99 లక్షలు. అంటే స్పెషల్ ఎడిషన్ కోసం సుమారు రూ.91,000 అదనంగా చెల్లించాలి. ఈ అదనపు ధరకు ప్రధానంగా ప్రత్యేక డిజైన్, యాక్సెసరీలు, కొత్త ఫినిషింగ్ వంటి మార్పులు లభిస్తున్నాయి. హయబుసా స్పెషల్ ఎడిషన్‌ను పెర్ల్ విగోర్ బ్లూ కలర్ లో మాత్రమే అందిస్తున్నారు. సాధారణ మోడల్‌ తో పోలిస్తే ప్రత్యేక డీకాల్స్, కొత్త వీల్ ఫినిష్, 3D సుజుకి ఎంబ్లమ్, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ లాంటి మార్పులు ఉన్నాయి. అంతేకాదు.. మఫ్లర్ ఎండ్, హీట్ గార్డ్‌ లకు అనోడైజ్డ్ ఫినిష్ ఇచ్చారు. స్పెషల్ ఎడిషన్‌లో సింగిల్ సీట్ కౌల్‌ను కూడా స్టాండర్డ్‌ గా అందిస్తున్నారు. దీంతో బైక్ లుక్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

స్టాండర్డ్ హయబుసాకు మూడు కొత్త కలర్స్!

Advertisement

స్పెషల్ ఎడిషన్‌తో పాటు సాధారణ హయబుసాను కూడా సుజుకి కొత్త రంగులతో అప్‌ డేట్ చేసింది. ఇందులో మూడు డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్లు ఉన్నాయి. కొత్త రంగులతో పాటు స్టాండర్డ్ మోడల్ ధరను కూడా రూ.18.99 లక్షలకు పెంచారు.

ఇంజిన్‌లో నో ఛేంజెస్  

హయబుసా స్పెషల్ ఎడిషన్‌లో కీలకమైన మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో అదే 1,340cc, లిక్విడ్ కూల్డ్, DOHC ఇన్‌ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 190 bhp పవర్, 142 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌ బాక్స్ జత చేశారు. అంటే స్పెషల్ ఎడిషన్‌ను కొనుగోలు చేసే వారికి అదనపు పవర్ కంటే ప్రత్యేకమైన లుక్, ఫినిషింగ్, టెక్నాలజీ అప్‌ డేట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

కొత్త బ్యాటరీతో పాటు ఎలక్ట్రానిక్స్ అప్‌డేట్!

Advertisement

2026 హయబుసా రేంజ్‌లో ముఖ్యమైన మార్పుల్లో కొత్త ELIIY పవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఒకటి. ఇది పాత బ్యాటరీ కంటే తేలికగా, కాంపాక్ట్‌ గా ఉంటుందని సుజుకి చెబుతోంది. లోడ్ ఉన్నప్పుడు వోల్టేజ్ మరింత స్టేబుల్ గా ఉండేలా దీనిని రూపొందించారు. గేర్ మార్చే సమయంలో కూడా క్రూయిజ్ కంట్రోల్ యాక్టివ్‌గా ఉండేలా సిస్టమ్‌ను మెరుగుపరిచారు. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్, వివిధ రైడింగ్ మోడ్‌లు, హిల్ హోల్డ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also: రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

Tags

Related News

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×