ఈ మధ్య రిపోర్టర్లు వరద నీటిలో దిగి మరీ లైవ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ రిపోర్టర్ మాత్రం.. నదిలో కొట్టుకుపోయిన ఓ బాలిక కోసం వార్తలు చెబుతూ ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. నదిలోకి దిగి వార్తలు చెబుతున్న సమయంలో.. అతడి కాళ్లకు మెత్తగా ఏదో తగిలింది. కాసేపు అది ఏమిటనేది అర్థం కాలేదు. తర్వాత అది ఆ బాలిక డెడ్ బాడీ అని తెలుసుకుని షాకయ్యాడు.
ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట బాకాబల్ ప్రాంతంలోని మీరిమ్ నదిలో రయిస్తా అనే బాలిక తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేస్తూ నదిలో మునిగిపోయింది. ఆమె కోసం పోలీసులు, స్థానికులు నది మొత్తం జల్లెడ పట్టారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో లెనిల్డో ప్రజావ్ అనే రిపోర్టర్ జరిగిన ఘటన గురించి చెప్పేందుకు ఆ నది వద్దకు వెళ్లాడు. ఆ నది ఎంత లోతు ఎంత ఉందో తెలుసుకోవడం కోసం అందులోకి దిగాడు. నదిలో నీరు తన ఛాతి వరకు ఉందని చెప్పాడు. ఆ తర్వాత బాలిక మునిగిపోవడం వెనుక గల కారణాలు తెలిపాడు. నదిలో అటూ తిరుగుతూ లైవ్ చెబుతున్న సమయంలో అతడి కాలికి ఏదో తగిలింది. అంతే.. వెంటనే ఉలిక్కిపడ్డాడు. కాసేపు గందరగోళానికి గురయ్యాడు. వెంటనే లైవ్ ఆపేసి.. తన కాలికి ఏదో తగిలిందని కెమేరా మ్యాన్‌కు చెప్పాడు.
అది బాలిక డెడ్ బాడీ?
నది ఒడ్డున ఉన్నవాళ్లు నీ కాళ్లకు రాళ్లు తగిలి ఉండవచ్చని అన్నారు. ఇందుకు లెనల్డో స్పందిస్తూ.. ‘‘కాదు.. అది రాయి కాదు. నా కాలికి ఏదో మెత్తగా తగిలింది’’ అంటూ నది నుంచి బయటకు వచ్చేశాడు. ‘‘నాకు చాలా భయంగా ఉంది. నేను నదిలోకి వెళ్లను. అది ఆ బాలిక డెడ్ బాడీ కావచ్చు. నా కాలికి ఆమె భుజం తగిలినట్లు అనిపించింది. లేదా చేప కూడా కావచ్చు. అదేమిటో చెప్పలేకపోతున్నా’’ అని అన్నాడు. నదిలో ప్రవాహం కూడా ఎక్కువగా ఉందని, గుంతలు ఎక్కువగా ఉన్నాయని.. మళ్లీ వెళ్లకపోవడమే మంచిదని తెలిపాడు.
Brazilian journalist discovers body of missing 12yo girl while filming report about her disappearance pic.twitter.com/73ygG2tGYh
— RT (@RT_com) July 21, 2025
Also Read: జస్ట్ రూ.2లకే షర్ట్.. యువకులు పోటెత్తడంతో షాప్ యజమాని..?
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నదిలో మళ్లీ గాలింపులు చేశారు. సరిగ్గా ఆ రిపోర్టర్ చెప్పిన ప్లేసులోనే రయిస్సా మృతదేహం కనిపించింది. బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్ట్ మార్టంకు తరలించారు. ఆమె మరణం ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్లే జరిగిందని తేలింది. అలా ఆ రిపోర్ట్ వల్ల ఇక కనిపించదు అనుకున్న బాలిక మృతదేహం ఆచూకీ తెలిసింది. కానీ, ఈ ఘటన చాలా బాధాకరం కదూ.