E-Paper
Advertisement

వర్షాకాలం స్పెషల్.. ఏసీలో ‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?

వర్షాకాలం స్పెషల్.. ఏసీలో ‘డ్రై మోడ్’ ఆన్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?
Advertisement

AC Dry Mode: వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో విపరీతంగా తేమ పెరిగిపోతుంది. ఫలితంగా బయట వర్షం పడుతున్నా.. ఇంట్లో మాత్రం ఉక్కపోతగా, శరీరం జిగటగా అనిపిస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఏసీని ఎప్పటిలాగే ‘కూల్ మోడ్’లో రన్ చేస్తుంటారు. కానీ వర్షాకాలంలో కూల్ మోడ్ కంటే ‘డ్రై మోడ్’ (Dry Mode) ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ 7 ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

తేమను తొలగించడం

వర్షాకాలంలో ప్రధానంగా వెంటాడే సమస్యల్లో తేమ ఒకటి. దీనికి ఏసీలోని డ్రై మోడ్ ఫీచర్ తో చెక్ పెట్టొచ్చు. ఇది ‘డీహ్యుమిడిఫైయర్‌’గా పని చేస్తూ.. గదిలోని తేమను పూర్తిగా పీల్చేసి వాతావరణాన్ని పొడిగా మార్చేస్తుంది.

విద్యుత్ బిల్లు ఆదా

Advertisement

కూల్ మోడ్‌తో పోలిస్తే డ్రై మోడ్‌లో ఏసీ కంప్రెషర్ చాలా తక్కువ టైం వర్క్ చేస్తుంది. ఫ్యాన్ కూడా తక్కువ స్పీడ్‌తో తిరగడం వల్ల కరెంట్ వినియోగం తగ్గి.. పవర్ బిల్లు పెద్ద ఎత్తున ఆదా అవుతుంది.

ఆహ్లాదకరమైన చల్లదనం

వర్షాకాలంలో సాధారణంగానే వాతావరణ చల్లగా ఉంటుంది. ఈ క్రమంలో ఏసీని కూల్ మోడ్ లో పెడితే గది ఐస్ ముక్కలా మారి.. ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అదే డ్రై మోడ్ అయితే గదిని ఎక్కువ చల్లబరచకుండా, సౌకర్యవంతంగా ఉండేలా ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.

ఫంగస్, బ్యాక్టీరియాకు చెక్

Advertisement

సాధారణంగా ఇంట్లో తేమ ఎక్కువైతే గోడలు, బట్టలు, పుస్తకాలపై బూజు పడుతుంది. డ్రై మోడ్ గాలిని పొడిగా ఉంచడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు, అలర్జీ కారకాలు పెరగకుండా అడ్డుకుంటుంది.

దుర్వాసన దూరం

వర్షాకాలంలో ఇళ్లలో ఒక రకమైన వాసన వస్తుంటుంది. డ్రై మోడ్ గదిలోని తేమను తొలగించడం వల్ల ఆ జిడ్డు వాసన పోయి గది ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది.

ఏసీ లైఫ్ పెరుగుదల

డ్రై మోడ్‌లో ఏసీ కంప్రెషర్‌ అవసరాన్ని బట్టి ఆన్, ఆఫ్ అవుతుంటుంది. దీనివల్ల ఏసీ యంత్రంపై లోడ్ తగ్గి, అది ఎక్కువ కాలం మన్నిక వస్తుందని నిపుణులు అంటున్నారు.

Also Read: అద్దె ఇంట్లో ఏసీలు, గీజర్లు పెట్టొచ్చా? యజమాని అనుమతి లేకుండా.. చేయగలిగే మార్పులివే!

చర్మ సమస్యల నుంచి రక్షణ

అధిక తేమ వల్ల చర్మంపై చెమట సరిగ్గా ఆరక దురదలు, చెమటకాయలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అదే డ్రై మోడ్ ఆన్ చేస్తే.. గాలిని పొడిగా మార్చి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఏకంగా రూ.14,000 తగ్గింపు!

Related News

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×