Raha Kapoor Future: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల ముద్దుల కుమార్తె రాహా కపూర్ సోషల్ మీడియాలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాహాకు సంబంధించిన ఏ చిన్న ఫోటో లేదా వీడియో బయటకు వచ్చినా నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే, తాజాగా ఆలియా భట్ తన కూతురి భవిష్యత్తు గురించి, ఆమెకున్న ఆసక్తుల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’ (Alpha) ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆలియా భట్ తన పర్సనల్ లైఫ్ మరియు మాతృత్వం గురించి మనసు విప్పి మాట్లాడింది.
Read also-విడాకులు తీసుకోబోతున్న మరో టీవీ నటి.. అసలేం జరిగిందంటే..?
రాహా ప్రవర్తన, ఆమె అలవాట్ల గురించి ఆలియా మాట్లాడుతూ.. “రాహాను చూస్తుంటే తను కచ్చితంగా స్టేజ్ పై రాణించేందుకే పుట్టింది అనిపిస్తుంది. తను చాలా ‘ఫిల్మీ’. పాటలు వినడం, డాన్స్ చేయడం అంటే ఆమెకు ప్రాణం. ఎలాంటి డాన్స్ స్టెప్స్ అయినా చాలా ఈజీగా, వేగంగా క్యాచ్ చేస్తుంది. అంత చిన్న వయసులోనే తనలో ఒక లీడర్ క్వాలిటీస్, ఆలోచనా విధానం (Thinker) కనిపిస్తున్నాయి” అంటూ కూతురిపై ప్రశంసలు కురిపించింది.
రాహాకు కేవలం కళల పైనే కాకుండా స్పోర్ట్స్, ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ అంటే కూడా చాలా ఇష్టమని ఆలియా తెలిపింది. రాహాలో మంచి పోటీతత్వం (Competitive Spirit) ఉందన్న ఆలియా.. తన కూతురు పెద్దయ్యాక ఒక అథ్లెట్ (క్రీడాకారిణి) కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా మరోసారి వెల్లడించింది.
Read also-ఒకే ఒక్క రీచార్జ్.. ఏడాది మొత్తం ఫ్రీ 5G, కాల్స్, ఓటీటీ.. జియో దుమ్మురేపే ప్లాన్!
తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం, కెరీర్ పట్ల ఉన్న అంబిషన్స్ పూర్తిగా మారిపోయాయని ఆలియా స్పష్టం చేసింది. “ఇప్పటికీ నా కెరీర్ నాకు ముఖ్యమే, కానీ రాహా పుట్టిన తర్వాత నా ప్రత్యేకతగా మారాయి. ఇప్పుడు నేను చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాను. రాహాతో ఎక్కువ సమయం గడపడం కోసం ఎన్నో పెద్ద ప్రాజెక్టులను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయినా దానికి నేనేం బాధపడటం లేదు” అని ఆలియా చెప్పుకొచ్చింది.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు 2022 చివర్లో రాహా జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడేళ్లు దాటిన రాహా.. అటు కపూర్ ఖాన్దాన్, ఇటు భట్ కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్టార్ కిడ్‌గా కొనసాగుతోంది. మరి రాహా పెద్దయ్యాక తండ్రిలా యాక్టింగ్ వైపు వస్తుందా? లేక తల్లి కోరుకున్నట్లు అథ్లెట్ అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి!