E-Paper
Advertisement

ఫ్రిజ్‌లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!

ఫ్రిజ్‌లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!
Advertisement

Milk Storage: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో ఫ్రిజ్ అత్యవసరంగా మారిపోయింది. పాలు, పండ్లు, కూరగాయలు, వండి ఆహారపదార్థాలను తాజాగా ఉంచేందుకు.. చాలా మంది ఫ్రిజ్ మీదనే ఆధారపడుతున్నారు. అయితే పాలను ఫ్రిజ్ లో నిల్వ ఉంచే విషయంలో చాలా మందిని ఓ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. పాలను ఫ్రిజ్ లో ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు? అని తెగ ఆలోచిస్తుంటారు. దీనిపై ఈ కథనంలో క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.

ప్యాకెట్ పాలు vs విడి పాలు

సాధారణంగా మార్కెట్ నుండి తెచ్చే ప్యాకెట్ పాలు.. ఫ్రిజ్‌లో పెడితే వాటిపై ఉన్న ‘ఎక్స్‌పైరీ డేట్’ ముగిసిన తర్వాత కూడా 2-5 రోజుల వరకు పాడవకుండా ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉంటేనే ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అదే విడి పాలు లేదా కాచని పాలు అయితే.. ఫ్రిజ్‌లో పెట్టినా 1 నుండి 2 రోజుల్లోనే వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

పాలు కాచిన తర్వాత ఎంతకాలం?

Advertisement

చాలామంది పాలను ఒకసారి కాచిన తర్వాత ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా కాచిన పాలను ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచితే 3 నుండి 4 రోజుల వరకు వాడుకోవచ్చు. అయితే పాలను ప్రతిరోజూ పదే పదే వేడి చేసి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పాలు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కాబట్టి పదే పదే కాచిన పాలను 1-2 రోజుల్లో వాడేస్తేనే బెటరని హితవు పలుకుతున్నారు.

ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టాలి?

ఫ్రిజ్ లో పాలను పెట్టే ప్రదేశాన్ని బట్టి కూడా వాటి నిల్వ సామర్థ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది పాలు లేదా జ్యూస్ ప్యాకెట్లను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లలో పెడుతుంటారు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది సరైన పద్దతి కాదు. ఫ్రిజ్ డోర్ తరచూ తీస్తూ మూస్తూ ఉండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. కాబట్టి పాలను ఎల్లప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలో ఎక్కడైతే చల్లదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉంచాలని హితవు పలుకుతున్నారు. పాలు ఉన్నప్పుడు ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎప్పుడూ 4°C లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: వానొస్తే చాలు.. పాములు ఇళ్లల్లోకి దూరిపోతాయి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

పాలు పాడయ్యాయని ఎలా గుర్తించాలి?

కొన్ని సందర్భాల్లో నిర్ణీత కాలం కంటే ముందే పాలు పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని సంకేతాలతో పాలు పాడైనట్లు ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పాలు కాస్త పుల్లటి లేదా ఘాటైన వాసన వస్తే అవి పాడయ్యాయని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పాల రంగు మారి, గడ్డలుగా, మరీ చిక్కగా తయారైతే వాటిని వాడకూడదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కొద్దిగా నోట్లో వేసుకున్నప్పుడు వింత రుచి అనిపిస్తే.. ఆ పాలను పారబోయడమే ఉత్తమమని తెలియజేస్తున్నారు.

Also Read: బట్టల ముడతలు పోవాలా? ఐరన్ బాక్స్ బెటరా? మోడరన్ స్టీమర్ బెస్టా?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×