Acer AI TransBuds| అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్‌పో ఈవెంట్ లో ఏసర్ కంపెనీ ఏఐ ట్రాన్స్‌బడ్స్ పేరుతో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఇవి మామూలు ఇయర్ బడ్స్ కాదు. ఇందులో అడ్వాన్స్ లెవెల్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి యూజర్స్ కు రియల్ టైమ్ వాయిస్ ట్రాన్స్‌లేషన్ అందిస్తాయి. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా విభిన్న భాషల్లో ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో సంభాషణ సులభతరం చేయాలనేది ఏసర్ కంపెనీ ఉద్దేశం. ప్రస్తుతానికి ఈ ఇయర్ బడ్స్ లోని టెక్నాలజీ 15 భాషలను సపోర్ట్ చేస్తాయి.
ఆసియా, యూరోప్ దేశాలు, ఉత్తర, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మాట్లాడే భాషల ట్రాన్స్‌లేషన్ ఈ ఏఐ బడ్స్ చేయగులుగుతాయి. కేవలం భాషల అనువాదం మాత్రమే కాదు.. ఇవి చాలా లైట్ వెయిట్ అంటే తక్కువ బరువు కలవి. ఈ కారణంగానే వీటిని రోజంతా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అయితే ఏసర్ కంపెనీ ఈ ట్రాన్ బడ్స్ ధర ఇండియాలో ఎంతో రివీల్ చేయలేదు.
ఏసర్ ట్రాన్స్‌బడ్స్ గురించి మరిన్ని వివరాలు
ఈ ఇయర్ బడ్స్ ఉపయోగంతో మీకు ఏదైనా తెలయని విదేశీ భాషను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులోని ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ రియల్ టైమ్ లో పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడిన వెంటనే దాన్ని మీకు అర్థమయ్యే భాషలోకి అనువాదం చేసి వినిపిస్తుంది. ఈ ఇయర్ బడ్స్.. బ్లాక్ కలర్‌లో ఇయర్ హుక్ సెక్యూర్ ఫిట్ డిజైన్ లో ఉంటాయి. ఇవి బ్లూ టూత్ 5.4 వైర్ లెస్ కనెక్టివిటీ లో పనిచేస్తాయి. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్స్ కు స్టేబుల్ కనెక్షన్ కోసం ఇందులో ప్లగ్ ఇన్ రిసీవర్‌ని సపోర్ట్ చేస్తుంది.
బిజినెస్ మీటింగ్స్, ట్రావెల్, లైవ్ స్ట్రీమింగ్, ఆన్ లైన్ లర్నింగ్ లాంటి సమయంలో ఇందులోని టు వే ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. యూజర్ ఒక ఇయర్ బడ్ వేసుకున్నా.. అందులోని ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. ఇది లైవ్ కాప్షనింగ్, సంభాషణ రివ్యూ కోసం ట్రాన్స్‌క్రిప్ట్ ని కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ బిల్డ్
ఒక్కో ఇయర్ బడ్‌లో 50ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. అయితే దీని చార్జింగ్ కేస్ 400 ఎంఎహెచ్ బ్యాటరీని, యుఎస్‌బి టైప్ సి చార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. దీని మొత్తం సెట్ కేవలం 65 గ్రాములే ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్.. ఎక్కువ కాలం మన్నిక వచ్చే ఎబిఎస్ మెటీరియల్ ద్వారా తయారు చేయబడ్డాయి.
Also Read: వేసవిలో పేలిపోతున్న ఏసీలు.. నివారించడానికి ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రాన్స్ బడ్స్ సపోర్ట్ చేసే 15 భాషలు ఇవే..
ఇంగ్లీష్, హిందీ, చైనా, జపానీస్, కొరియన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యా, మొదలగు. భారతీయులు ఇతర దేశాలకు ప్రయాణించినప్పుడు ఈ భాషల అనువాదంతో ఏసర్ బడ్స్ బాగా ఉపయోగపడతాయి.
ఎప్పుడు లాంచ్
ఏసర్ ఈ ట్రాన్స్‌బడ్స్ గురించి అన్ని వివరాలు వెల్లడించలేదు. ముఖ్యంగా ఇండియాలో ఎప్పుడు లాంచ్, దాని ధర ఎంతో చెప్పలేదు. అయితే ఈ ట్రాన్స్ బడ్స్.. అనువాదం లాంటి పనులు చేసే వారికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు తమిళం, తెలుగు, లాంటి ప్రాంతీయ భాషలు కూడా భవిష్యత్తులో యాడ్ చేసే అవకాశం ఉంది. ఇక ధర అందుబాటులో ఉంటే స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, ట్రావెలర్స్ వీటిని తప్పక కొనుగోలు చేసే అవకాశం ుంది.