Acer Aspire Lite AL15-53: చదువుకోవడానికి,ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి లేదా డైలీ టాస్క్‌ల కోసం ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా? అయితే.. మార్కెట్లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ల్యాప్‌టాప్‌లలో ‘Acer Aspire Lite AL15-53’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం రూ.46,490 ధరకే ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్, యూజర్లకు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తోంది. స్టూడెంట్స్ , ఉద్యోగుల అవసరాలను పూర్తిగా తీర్చేలా రూపొందించిన ఈ డివైజ్ పూర్తి ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులకు, ఉద్యోగులకు ల్యాప్‌టాప్ అనేది అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, క్వాలిటీ కోరుకునే వారి కోసం ప్రముఖ బ్రాండ్ ఏసర్ మార్కెట్లోకి.. తెచ్చిన ఈ మోడల్ టెక్ లవర్స్ కు మొదటి ఆప్షన్‌గా మారుతోంది.పవర్ ఫుల్ ఫీచర్లు , స్టైలిష్ డిజైన్ బెస్ట్ ధరలోనే దొరుకుతోంది.
ఈ ల్యాప్‌టాప్.. స్టీల్ గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని థిన్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.59 కేజీలు మాత్రమే ఉండటం విశేషం. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 15.6 అంగుళాల (39.62 cm) పెద్ద ఫుల్ హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్ లేదా వినోదం కోసం సినిమాలు చూసేటప్పుడు ఈ డిస్‌ప్లే చక్కటి వ్యూయింగ్ ఫీల్ ఇస్తుంది.
మల్టీటాస్కింగ్ ఈజీగా చేసుకోవడానికి ఈ ల్యాప్‌టాప్‌లో లేటెస్ట్ హార్డ్‌వేర్ వాడారు. ఇది పవర్ ఫుల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. దీని వల్ల డైలీ అప్లికేషన్లు చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. ఇందులో.. 8 GB RAM , 256 GB SSD స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఎస్ఎఎస్ఉండటం వల్ల ల్యాప్‌టాప్ ఆన్ అవ్వడానికి, ఫైల్స్ ఓపెన్ అవ్వడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అదనంగా ఇందులో విండోస్ హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆఫీస్ ఆప్షన్స్ ప్రీ-ఇన్‌స్టాల్‌గా వస్తాయి. ఇది స్టూడెంట్స్‌కు , ఆఫీస్ వర్క్ చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ ల్యాప్‌టాప్‌లో అవసరమైన అన్ని రకాల పోర్ట్‌లు ,కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్, వివిధ రకాల యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్ ఉండటం వల్ల పెరిఫెరల్స్ కనెక్ట్ చేయడం ఈజీ. అలాగే పూర్తి స్థాయి కీబోర్డ్ , న్యూమరిక్ కీప్యాడ్ ఉండటం వల్ల టైపింగ్ చేయడం మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ దీని మరో ప్రత్యేకత.
Also Read: రూ.5,999కే వాషింగ్ మెషీన్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి!
మార్కెట్లో ఈ మోడల్ ల్యాప్‌టాప్ అసలు ధర సుమారు రూ. 46,490 వరకు ఉంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ జెనరేషన్ ప్రాసెసర్, ఎంఎస్ ఆఫీస్, పెద్ద స్క్రీన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఆన్ లైన్ స్టోర్లు లేదా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో వివిధ బ్యాంక్ ఆఫర్లు పోల్చుకుని కొంటే.. మరింత ప్రయోజనం పొందవచ్చు.
బడ్జెట్‌లో ఉంటూనే బెస్ట్ ఫర్మామెన్స్, స్టైలిష్ లుక్‌ను కోరుకునే వారికి ఏసర్ ఆస్పైర్ లైట్ ఒక అద్భుతమైన ఛాయిస్ అని చెప్పొచ్చు. దీని తక్కువ బరువు, లేటెస్ట్ ప్రాసెసర్ , ఎంఎస్ ఆఫీస్ సపోర్ట్ దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మీరు కూడా కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే దీనిని నిస్సందేహంగా ఆర్డర్ చేయెచ్చు.