Ai Plus LapTab: టాబ్లెట్, ల్యాప్‌టాప్.. రెండింటికీ వాటి ప్రత్యేకమైన ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉండే కొన్ని పరిమితులను అధిగమించేలా కొత్త తరం డివైజ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, రోజువారీ పనుల కోసం తేలికైన డివైజ్ కోరుకునే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఐ ప్లస్’ సంస్థ త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్న కొత్త డివైజ్ ఆసక్తిని పెంచుతోంది. ‘ఐ ప్లస్ ల్యాప్‌టాప్’ పేరుతో వస్తున్న ఈ డివైజ్ టాబ్లెట్ తరహా డిజైన్‌తో పాటు ల్యాప్‌టాప్ అనుభూతిని అందించేలా రూపొందించారు.
10,000mAh బ్యాటరీ.. 33W ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ డివైజ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్లలో బ్యాటరీ ఒకటి. ఇందులో 10,000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. దీంతో ఆన్‌లైన్ క్లాసులు, వీడియోలు, బ్రౌజింగ్ లేదా ఇతర పనులు చేసేటప్పుడు తరచూ ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.
Also Read: రియల్‌మీ నుంచి హ్యారీ పాటర్ లవర్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఈ క్రేజీ లుక్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
యూజర్ల అవసరాలను బట్టి Ai Plus ల్యాప్‌టాప్‌ను మూడు డిస్‌ప్లే సైజుల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 11 అంగుళాలు, 12 అంగుళాలు, 13 అంగుళాల స్క్రీన్ ఆప్షన్స్ ఉండనున్నాయి. చిన్న స్క్రీన్ కావాలనుకునేవారి నుంచి పెద్ద డిస్‌ప్లే కోరుకునేవారి వరకు ఈ మోడల్స్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ డివైజ్ NxtQ OSపై పనిచేయనుంది. ఇందులో అందించే ప్రత్యేకమైన PC మోడ్ ద్వారా ఒకేసారి పలు విండోస్‌ను ఓపెన్ చేసి ల్యాప్‌టాప్ మాదిరిగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. కీబోర్డ్, స్టైలస్ సపోర్ట్ కూడా ఉండటంతో టైపింగ్, నోట్స్ రాసుకోవడం వంటి పనులు సులభంగా చేయొచ్చు.
కనెక్టివిటీ విషయంలోనూ ఈ డివైజ్‌లో ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ సిమ్‌తో పాటు 5G సపోర్ట్ ఉండనుంది. దీంతో Wi-Fi అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ మొబైల్ డేటాతో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలు కనిపించాయి. అయితే ధర, అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Also Read: సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!