Realme Buds T500 Pro Harry Potter Edition: హ్యారీ పాటర్ మ్యాజిక్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగానే ఉంటారు. హోగ్వార్ట్స్ ప్రపంచం, దాని మ్యాజికల్ లుక్, సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన వస్తువులు అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ మ్యాజికల్ ఫీల్‌ను టెక్నాలజీతో కలిపి అందించేందుకు రియల్‌మీ కొత్తగా ఓ స్పెషల్ ఎడిషన్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే ‘రియల్‌మీ బడ్స్ T500 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్’. హోగ్వార్ట్స్ థీమ్‌ను గుర్తు చేసే డిజైన్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్ చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఆకట్టుకునే ఫీచర్లను కూడా అందిస్తున్నాయి.
రియల్‌మీ బడ్స్ T500 ప్రో హ్యారీ పాటర్ ఎడిషన్ ధర రూ.6,999. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ‘మ్యాజిక్ బ్రౌన్’ కలర్‌లో రూపొందించారు. డార్క్ బ్రౌన్ ఫినిషింగ్, హ్యారీ పాటర్ థీమ్‌కు తగ్గ డిజైన్ దీని ప్రత్యేకత. ముఖ్యంగా హ్యారీ పాటర్ అభిమానులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also Read: సంచలనం సృష్టిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ డీల్స్.. ఐఫోన్ 17తో పాటు ఆ ఐటమ్స్‌పై భారీ ఆఫర్లు!
ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో 12.4ఎంఎం డ్రైవర్లను అందించారు. హై-రెస్ ఆడియో, LHDC 5.0 కోడెక్ సపోర్ట్ ఉన్నాయి. రియల్‌మీ లింక్ యాప్ ద్వారా ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించేందుకు 50డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, కాల్స్ కోసం ఆరు మైక్రోఫోన్లు ఉన్నాయి.
గేమ్స్ ఎక్కువగా ఆడేవారి కోసం 45ఎంఎస్‌లో లేటెన్సీ సపోర్ట్ అందించారు. బ్లూటూత్ 6.1 కనెక్టివిటీతో ఒకేసారి మూడు డివైజెస్‌కు కనెక్ట్ చేయవచ్చు. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ మధ్య సులభంగా మారే అవకాశం ఉంది. ఇయర్‌బడ్స్ ఎక్కడైనా మిస్ అయితే ‘ఫైండ్ మై ఇయర్‌బడ్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది.
బ్యాటరీ విషయంలోనూ ఈ ఇయర్‌బడ్స్ ఆకట్టుకుంటాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 56 గంటల వరకు బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఎన్‌సీ ఆఫ్‌లో ఉంటే ఇయర్‌బడ్స్ సుమారు 13.5 గంటల వరకు పనిచేస్తాయి. సుమారు గంటలో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. రూ.7 వేల లోపు బడ్జెట్‌లో ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు మంచి ఫీచర్లు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
Also Read: ఎప్పుడూ అదే గ్రీన్ స్క్రీన్‌తో బోర్ అనిపిస్తుందా? వాట్సప్‌లో రాబోతున్న ఈ కొత్త థీమ్స్ చూశారా?