E-Paper
Advertisement

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!
Advertisement

Public Toilets: స్వేచ్చ బ్యూరో: ప్రజల అవసరాల కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడకపోగా.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా తాళాలు.. మరికొన్ని చోట్ల అపరిశుభ్రత, దుర్వాసన. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే బస్‌స్టాప్‌లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్‌ ప్రాంతాల్లోనే ఈ దుస్థితి నెలకొనడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల కోసం నిర్మించిన వసతులు ఉన్నా లేనట్టే మారడంతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

12 టాయిలెట్లు.. పరిస్థితి దారుణం

స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గతంలో మున్సిపల్‌ పాలక మండలి పరిధిలోని ఆరు గ్రామాల్లో గ్రామానికి రెండు చొప్పున మొత్తం 12 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించారు. రోడ్ల పక్కన, బస్‌స్టాప్‌లు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేశారు.నిర్మాణం పూర్తయిన తొలినాళ్లలో కొంతకాలం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగింది. అనంతరం మున్సిపాలిటీ సీడీఎంసీలో విలీనం కావడంతో పరిస్థితి మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. నిర్వహణ బాధ్యతలు, పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఒక్కొక్కటిగా టాయిలెట్లు మూతపడుతున్నాయని ఆరోపిస్తున్నారు.

తాళాలు వేసి.. ప్రజలను బయటకు పంపుతున్నారా?

Advertisement

ప్రజల కోసం నిర్మించిన మరుగుదొడ్లకే తాళాలు వేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెరిచి ఉన్న చోట్ల కూడా శుభ్రత లేకపోవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నీరు లేకపోవడం.. శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడం.. నిర్వహణపై నిఘా లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

Also read: రియల్‌మీ నుంచి హ్యారీ పాటర్ లవర్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఈ క్రేజీ లుక్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

రద్దీ ప్రాంతాల్లోనే దుస్థితి..

Advertisement

దుండిగల్‌ బస్‌స్టాప్‌, బహదూర్‌పల్లి చౌరస్తా, గండిమైసమ్మ తదితర రద్దీ ప్రాంతాల్లో పబ్లిక్‌ టాయిలెట్ల పరిస్థితిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ప్రాంతాల్లో కనీస మరుగుదొడ్డి సౌకర్యం అందుబాటులో లేకపోవడం దారుణమని అంటున్నారు.స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో ప్రచారం ఒకవైపు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోవైపు ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే పారిశుద్ధ్య పనులు హడావుడిగా చేపట్టి.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వెంటనే వినియోగంలోకి తేవాలి: మాజీ కౌన్సిలర్‌

ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ కౌన్సిలర్‌ జక్కుల కృష్ణయాదవ్‌ అన్నారు. ముఖ్యంగా మహిళల ఇబ్బందులు చెప్పలేనివిగా ఉన్నాయన్నారు.టాయిలెట్లను వెంటనే శుభ్రం చేసి, నీటి వసతి కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను డిమాండ్‌ చేశారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నిర్వహణపైనా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు.

నీటి వసతి లేకపోవడం ప్రధాన సమస్య..

పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణలో ప్రధాన సమస్య నీటి వసతి లేకపోవడమేనని దుండిగల్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకట మణి కరణ్‌ తెలిపారు. సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌కు లేఖ రాశామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణను పునరుద్ధరించేందుకు ఫైల్‌ పంపించామని, త్వరలో సమస్యను పరిష్కరించి టాయిలెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

Also read: ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

Tags

Related News

ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

భూముల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే నీళ్ల రాజకీయం: మంత్రి వాకిటి శ్రీహరి

KTR, హరీష్‌రావు పేర్లు ఫామ్‌హౌస్ రావు 1, 2గా మార్చుకోవాలి: బల్మూరు వెంకట్

నిధులు ఇస్తున్నా నిర్లక్ష్యమా? వరంగల్ ఆస్పత్రి పనులపై అధికారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?

హోటల్‌లో అనుమానాస్పదంగా యువతి మృతి.. విశాఖ నుంచి ప్రియుడితో కలిసి రాక, హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన

Big Stories

Advertisement
×