E-Paper
Advertisement

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా

అభిషేక్ శర్మ డకౌట్…అల్లాడించిన పసికూన జపాన్‌, అతి కష్టమీద గెలిచిన టీమిండియా
Advertisement

Japan vs India: టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య ఏకైక టీ20 మ్యాచ్ (One-off T20I, India tour of Japan, 2026) చాలా ఉత్కంఠ బరితంగా సాగింది. ఈ మ్యాచ్ కు మొదట వర్షం అడ్డంకిగా మారినప్పటికీ, 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇందులో బలంగా కనిపించిన టీమిండియా చాలా కష్టపడి విజయం సాధించింది. పెద్దగా అనుభవం లేని జపాన్ క్రికెట్ జట్టును చిత్తుగా ఓడించాల్సింది పోగా, పోరాడాల్సి వచ్చింది.  జపాన్ పై చమటోడ్చి గెలిచిన శ్రేయస్ అయ్యర్ సేన, ఎట్టకేలకు మరో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

చుక్కలు చూపించిన జపాన్.. పోరాడి గెలిచిన టీమిండియా

టీమిండియా వర్సెస్ జపాన్ (Japan vs India) మధ్య ఏకైక టీ20 మ్యాచ్ సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం , సానో, కాంటో (Sano International Cricket Ground, Sano, Kanto) వేదికగా జరిగింది. అయితే, ఈ కాంటో వేదికగా ఉదయం నుంచి దాదాపు 3 గంటల పాటు వర్షం పడింది. ఈ క్రమంలో మ్యాచ్ జరిగే ఛాన్సులు లేవని అభిమానులు నిరాశ చెందారు. వర్షం తగ్గినా కూడా ఔట్ ఫీల్డ్ మాత్రం తడిగా ఉండటంతో 10 గంటల సమయంలో ప్రారంభం కావాల్సిన టీమిండియా వర్సెస్ జపాన్ టీ20 మ్యాచ్, మధ్యాహ్నాం 12.40 సమయంలో షూరూ అయింది.

Advertisement

ఈ క్రమంలోనే 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలని అంపైర్లు నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, పరమ చెత్తగా ఆడింది. ఈ మ్యాచ్ లో 5 ఓవర్లు ఆడిన టీమిండియా, 4 వికెట్లు నష్టపోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. సంజు శాంసన్ 9 పరుగులు, అభిషేక్ శర్మ డకౌట్ అయ్యారు. ఇషాన్ కిషన్ 3 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేశారు. తిలక్ వర్మ ఒకే పరుగు చేశాడు. టీమిండియా విధించిన టార్గెట్ ను ఛేదించే క్రమంలో 5 ఓవర్లు ఆడిన జపాన్…3 వికెట్ల నష్టానికి 30 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 2 పరుగుల తేడాతో టీమిండియా చాలా కష్టపడి గెలిచింది.

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు

డకౌట్స్ లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డ్

Advertisement

టీమిండియా వర్సెస్ జపాన్ (Japan vs India) మధ్య ఏకైక టీ20 మ్యాచ్ సందర్బంగా సెంచరీ హీరో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఒకే ఒక బంతి ఎదుర్కొన్న అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో డకౌట్స్ లో అభిషేక్ శర్మ చెత్త రికార్డ్ సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో 10 సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డును తన పేరిటన లిఖించుకున్నాడు. గతంలో రషీద్ ఖాన్ పేరుపై ఈ రికార్డు ఉండేది. అయితే, జపాన్ పై డకౌట్ అయిన అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ రికార్డ్ బద్దలు కొట్టాడు. అభిషేక్ శర్మ డకౌట్ అయిన తరుణంలోనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇండియన్ పిచ్ లపైనే అభిషేక్ శర్మ సెంచరీలు చేస్తాడని, విదేశీ ట్రాక్ లపై అతడికి ఆడరాదంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. కాగా మొన్న ఆఫ్ఘానిస్తాన్ పై అభిషేక్ శర్మ, 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు !

 

 

Related News

శభాష్ అమ్మాయిలు…శ్రీలంక ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

సౌర‌వ్ గంగూలీ కెప్టెన్సీలో తాను ఆడింటే, నా త‌ల‌రాత మారేంది

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని టీమిండియా ఆడుతుంది..అందుకే ఈ సారి ఓడిస్తాం

ఐపీఎల్ వ‌ల్లే, ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల పొగ‌రు దిగింది..రాబిన్ ఉతప్ప సంచ‌ల‌నం

మా పాకిస్తాన్ ప్లేయర్లు కోతుల కంటే దారుణం… వాటి కంటే ఎక్కువ అరటి పండ్లు మెక్కుతున్నారు !

CSK జ‌ట్టులో మ‌ళ్లీ ఫిక్సింగ్ క‌ల‌కలం..ఒక్క లీక్ రూ.70 ల‌క్ష‌లు ?

బాబర్ ఆజంను విమర్శిస్తే, పళ్ళు రాలగొడతా… వసీం అక్రమ్ కు తన్వీర్ అహ్మద్ హెచ్చరిక

Big Stories

Advertisement
×