E-Paper
Advertisement

Airtel బంపరాఫర్.. రోజుకు రూ.12 కే 5G డేటా, రూ.4,000 విలువైన బెనిఫిట్స్.. ప్లాన్ వివరాలు ఇవే!

Airtel బంపరాఫర్.. రోజుకు రూ.12 కే 5G డేటా, రూ.4,000 విలువైన బెనిఫిట్స్.. ప్లాన్ వివరాలు ఇవే!
Advertisement

Airtel Plan: దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) అత్యధిక ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ 5జీ ఎస్‌ఏ (స్టాండ్ ఎలోన్) సేవలు కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ రూ.649 ధరకు ఒక ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి వ్యాలిడిటీ, 5జీ సేవలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ఎయిర్ టెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.649 ప్లాన్ బెనిఫిట్స్ ఇవే

ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ రూ.649 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ 4జీ డేటాతో పాటు అపరిమిత 5జీ (5G NSA) సేవలను పొందొచ్చు. 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్ కు రోజుకు రూ.12 కంటే తక్కువ ఖర్చు కానుంది. అటు దేశవ్యాప్తంగా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్ లో పొందొచ్చు.

5G డేటాపై పరిమితి..

Advertisement

ఈ ప్లాన్‌లో లభించే ఉచిత 5జీ డేటా అపరిమితం కాదు. ప్రతి 30 రోజులకు 300 GB వరకు మాత్రమే 5జీ డేటాను వాడుకునే వెసులుబాటును ఎయిర్ టెల్ కల్పించింది. ఇది వినియోగదారులకు లభించే రోజువారీ 2 జీబీ 4జీ డేటాకు అదనంగా లభిస్తుండటం విశేషం.

Also Read: సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!

అదనపు బెనిఫిట్స్ కూడా

Advertisement

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు సుమారు రూ.4,000 విలువైన ‘అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం’ (Adobe Express Premium) సబ్‌స్క్రిప్షన్ 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నారు. దీంతో పాటు సేఫ్ నెట్‌వర్క్ ఫీచర్, ప్రతీ 30 రోజులకు హలో ట్యూన్ సెట్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. మెుత్తంగా 56 రోజుల వ్యాలిడిటీతో 5G సేవలు కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: చాణక్యనీతి.. అమ్మాయిలు ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకూడదు

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×