Power cut safety tips: మన ఇళ్లలో రోజువారీ.. వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మన జీవితాన్ని ఎంతో ఈజీ చేశాయి. అయితే.. కరెంట్ పోయినప్పుడు మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు మన జేబుకు చిల్లు పడేలా చేస్తాయి. కరెంట్ పోగానే.. మీ ఇంట్లో ఉన్న అన్ని స్విచ్‌లు ఆన్ లోనే ఉంచేస్తే.. కరెంట్ రాగానే ఒక్క సారిగా హై వోల్టేజ్ ప్రవహించి ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా కొన్ని పరికరాలు స్టాండ్‌బై.. మోడ్ లో ఉండి నిశ్శబ్దంగా కరెంట్‌ను లాగేస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. కరెంట్ పోయిన వెంటనే ఏ 5 వస్తువులను ఆపేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కరెంట్ పోగానే అందరూ ఏసీ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు. కరెంట్ అకస్మాత్తుగా పోయినప్పుడు.. కంప్రెసర్ రన్నింగ్‌లో ఉంటుంది. మళ్లీ పవర్ రాగానే సడన్‌గా పవర్ సర్జ్ ఏర్పడి ఏసీ మెయిన్ బోర్డు లేదా.. కంప్రెసర్ కాలిపోయే ప్రమాదం ఉంది. దీనిని రిపేర్ చేయాలంటే సుమారు రూ. 2,000 నుంచి రూ.6,000 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి కరెంట్ పోగానే ఏసీ స్విచ్ బోర్డును వెంటనే ఆఫ్ చేయాలి.
ఫ్రిజ్ అనేది నిరంతరం పనిచేసే.. గాడ్జెట్. కరెంట్ పోయినప్పుడు.. ఫ్రిజ్ డోర్ తెవడానికి.. ప్రయత్నించకండి.అలాగే.. కరెంట్ పోగానే.. దాని మెయిన్ ప్లగ్ ఆన్‌లోనే ఉంచిత.. పవర్ వచ్చిన వెంటనే ..హై వోల్టేజ్ కారణంగా దాని కంప్రెసర్ మోటార్ దెబ్బ తింటుంది. మార్కెట్లో కొత్త ఫ్రిజ్ కొపాలంటే.. ధరలు సుమారు రూ.15,000 నుంచి రూ.40,000 వరకు ఉంటాయి. కాబట్టి పవర్ కట్ అయిన వెంటనే ఫ్రిజ్ సేఫ్టీ కోసం ప్లగ్ డిస్కనెక్ట్ చేయడం మంచిది.
మీరు వర్క్ చేసుకుంటున్న సమయంలో.. అకస్మాత్తుగా కరెంట్ పోతే.. డెస్క్‌టాప్ పీసీలు లేదా మానిటర్లు ఆన్ లోనే ఉండిపోతాయి. హార్డ్‌వేర్ దెబ్బతినడమే కాకుండా.. పవర్ రిటర్న్ అయినప్పుడు మదర్ బోర్డ్ షాట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. మంచి యూపీఎస్ లేక పోతే మీ విలువైన కంప్యూటర్ పూర్తిగా పాడైపోతుంది.
వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతుకుతున్నప్పుడు కరెంట్ పోతే.. చాలా మంది దాని మోడ్ అలాగే వదిలేస్తారు. కరెంట్ రాగానే.. ఆటోమేటిక్‌గా అదే మోడ్ లో రన్ అయ్యి మోటార్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ వంటి హై-పవర్ గాడ్జెట్స్ స్టాండ్‌బై మోడ్‌లో ఉండి పవర్ వేస్ట్ చేస్తుంటాయి. వీటిని వెంటనే.. ఆఫ్ చేయడం ద్వారా కరెంట్ ఆదా అవుతుంది.
Also Read: ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!
5. టీవీ, వైఫై రౌటర్ :
టీవీలు, సెట్-టాప్ బాక్సులు స్టాండ్‌బై మోడ్‌లో ఉండి కరెంట్‌ను వినియోగిస్తుంటాయి. కరెంట్ పోయినప్పుడు వీటిని రిమోట్‌తో ఆఫ్ చేసినా, సాకెట్ దగ్గర పవర్ ఆన్ లోనే ఉంటుంది. సడన్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల టీవీ మదర్‌బోర్డ్ పాడైతే రిపేర్ ఖర్చు రూ. 5,000 నుంచి రూ.12,000 దాక అవుతుంది.
ఇంట్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపకరణాలను రక్షించుకోవడానికి.. అలాగే.. అధిక కరెంట్ బిల్లుల భారాని కి గురి కాకుండా ఉండటానికి పవర్ కట్ అయిన క్షణంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.మీ ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మీరు ఏ ఉపకరణాలను ముందుగా ఆఫ్ చేస్తారు?